లగడపాటి మళ్లీ ..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) :

ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్ర విభజన జరగదంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మళ్లీ లత్కోరు కూతలు కూశాడు. నెలరోజుల్లోపు సమస్యపై తేల్చే స్తామంటూ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌

షిండే ప్రకటించడంతో లగడపాటి మళ్లీ పిచ్చిపట్టిన వాడిలా ప్రేలాపణలు చేస్తున్నారు. ఆయన వైఖరిపై సీమాంధ్ర ప్రాంత ప్రజలే మండిపడుతున్నారు. ఏకాభిప్రాయం గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రం ఇవ్వం అని కేంద్రం చెప్పలేని పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబు కల్పించాడంటూ ఆయనపై మండిపడ్డారు.

తాజావార్తలు