లబ్ధిదారులకు కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ
జైనథ్ జనం సాక్షి సెప్టెంబర్ 30
జైనథ్ మండల కేంద్రంలో పీ ప్పర్ వాడ గ్రామపంచాయతీలో శ్రీరామ మందిర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన లబ్ధిదారుల పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు జైనథ్ మండలంలో వివిధ గ్రామపంచాయతీలలో మంజూరైన 1293 మంది లబ్ధిదారులకు కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు అండగా పెద్ద కొడుకు లాగా సీఎం కేసీఆర్ వృద్ధులకు అండగా నిలుస్తున్నారని ఏ రాష్ట్రంలో లేని విధంగా 2016 రూపాయలు పెన్షన్ దారులకు పంపిణీ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తాము చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చూడలేక ఓర్వలేక పోతున్నారు అని స్థానిక ఎమ్మెల్యే బిజెపి పార్టీ పైన మండిపడ్డారు. గుజరాత్ లో బిజెపి ప్రభుత్వం పెన్షన్ 400 రూపాయలు మాత్రమే ఇస్తున్నదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్ మండల ఎంపీపీ మాల్ శెట్టి గోవర్ధన్ వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ డిసిసిబి చైర్మన్ అడ్డీ బోజారెడ్డి రైతుబంధు చైర్మన్ సరసం లింగారెడ్డి జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి ఎంపీడీవో గజానంన్ వివిధ గ్రామాల కార్యదర్శులు ,సర్పంచులు ఎంపీటీసీలు పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.