లింగంపేట్ నుండి గాంధారి వెళ్ళే రోడ్డు మార్గం ఇటీవల రెండు కోట్ల యాభై లక్షలు తక్షణమే మంజూరు చేశారు
_గాంధారి జనంసాక్షి ఆగస్టు 09
గాంధారి మండలంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో R&B.వసతి గృహం లో ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ రోడ్లు భవనాల శాఖ అధికారులు పంచాయతీరాజ్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే లింగంపేట్ నుండి వయా నల్ల మడుగు గాంధారి వెళ్లే రోడ్డు మార్గం ఇటీవల రోడ్డు నిర్మాణం మంజూరు అయిన విషయం విదితమే రోడ్డు నిర్మాణానికి అదనంగా 2 కోట్లు 50లక్షలు అదనముగా ప్రతిపాదనలు పంపాలని తక్షణమే మంజురు చేస్తానని ఆదేశించారు మరియు అడ్లూర్ వాగు పైన బ్రిడ్జ్ నిర్మాణం కు మరియు రామారెడ్డి సమీపన గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం కు కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్దన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని మంజూరు చేయాలని కోరినారు తక్షణమే స్పందించిన మంత్రి ప్రతిపాదనలు పంపాలని త్వరలో మంజూరు ఉత్తర్వులు వస్తాయని తెలిపారు మంత్రి గారు వెళ్లిన అనంతరం ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతు త్వరగా పూర్తి సమాచారం తో ప్రతిపాదనలు పంపాలన్నారు కొన్ని సంవత్సరం లా నుండి ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి మంచిరోజులు రానున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలోమాజీ జెడ్ పి టి సి రాజేశ్వరరావు గాంధారి జెడ్పిటిసి శంకర్ నాయక్ రామ రెడ్డి ఎంపీపీ దశరథ రెడ్డి కపిల్ రెడ్డి దత్తాన్న తదితరులుపాల్గొన్నారు