లిడియా డేవిన్‌కు బుకర్‌ ప్రైజ్‌

లండన్‌, (జనంసాక్షి) :
అమెరికన్‌ రచయిత్రి లిడియా డేవిన్‌ ఈ ఏడాది మాన్‌ బుకర్‌ అంతర్జాతీయ బహుమతికి ఎంపికయ్యారు. లండన్‌లోని విక్టోరియా అండ్‌ అల్బర్ట్‌ మ్యూజియంలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో డేవిన్‌ బుకర్‌ప్రైజ్‌ అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ బహుమతి కోసం తొమ్మిది మంది ప్రముఖ రచయితలు పోటీపడ్డారు. తొమ్మిది మందిలో భారత్‌కు చెందిన యూఆర్‌. అనంతమూర్తి కూడా ఉన్నారు. సృజనాత్మక రచన బోధన వృత్తిలో ఉన్న డేవిన్‌ చిన్న కథలు రాయడంలో ప్రత్యేక స్థానం సంపాదించకున్నారు. ఆమె రచనలు క్లుప్తత అన్న అంశాన్ని పునర్నిర్వచిస్తాయని న్యాయమూర్తులు బృందం అభిప్రాయపడింది. ఆమె ఇప్పటి వరకూ ఏడు కథా సంపుటాలు, నవలను ప్రచురించారు.