లోక్‌సభలో ఆర్థిక సర్వే

4
– ప్రవేశపెట్టిన జైట్లీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. జీడీపీ వృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం ఉండే అవకాశం ఉందని తెలిపారు. ద్రవ్యలోటును 3.9శాతానికి పరిమితం చేయడం సాధ్యమే అని ఆయన అన్నారు. వచ్చే రెండేళ్లలో దేశ వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈఏడాది సేవల రంగం వృద్ధి రేటు 9.2 శాతంగా ఉంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో మన దేశం వాటా 18.5 శాతంగా ఉందని తెలిపారు. ప్రపంచ దేశాలు అస్థిరంగా ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం స్థిరంగా వృద్ధి చెందుతోందని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. 7వ వేతన సంఘం సిఫారసుల వల్ల ద్రవ్యోల్బణం పెద్దగా పెరగదని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం 5శాతం దాటే అవకాశం లేదు. బ్యాంకులకు మూలధనం పెంచే అవకాశం ఉన్నట్లు జైట్లీ వెల్లడించారు.2015-16లో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో లేనప్పటికి.. జీడీపీలో ద్రవ్యోలోటును 3.9శాతానికి తగ్గిస్తామని నివేదికలో పేర్కొంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పరిస్థితులు బలహీనంగా ఉంటే… ఆ ప్రభావం భారత్‌ పై కూడా ఉంటుందని తెలిపింది. డో పే కమిషన్‌ ద్వారా వస్తు వినియోగం పెరుగుతుందని కూడా అంచనావేసింది. గత ఐదేళ్లతో పోల్చితే 8 శాతం వృద్దిరేటు పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. సర్వీస్‌ సెక్టార్‌లో 9.2 శాతం వృద్ది రేటు అంచనా కట్టింది. కరెంట్‌ ఖాతాలోటు 1 నుంచి 1.5 శాతం ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. ఏడో వేతన సంఘంతో ద్రవ్యోల్బణంపై స్వల్ప ప్రభావం ఉంటుందని తెలిపింది. విద్య, వైద్యంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భవిష్యత్‌లో భారత్‌కు ఎఫ్‌డీఐలు విరివిగా వచ్చే అవకాశముందని తెలిపింది.