లోన్ ఆప్ లను డౌన్లోడ్ చేసి మీరు అప్పు తీసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త..:జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని

 మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):జిల్లా కార్యాలయంలో జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు సైబర్ నేరాల పై అవగాహన కల్పిస్తూ….సైబర్ నేరగాళ్ళు ఆర్ధిక నేరాలు పాల్పడడం కోసం రోజుకు ఒక కొత్త రకమైన పద్ధతిని ఎంచుకుంటున్న ప్రస్తుత తరుణంలో వాటిని అరికట్టడం కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు విసిరే వలకు చిక్కకుండా ఉండాలని జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు ప్రజలకు సూచించారు. ప్రభుత్వం, పోలీస్ వారు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి అమాయకులు బలవుతున్నారు. ఆర్ధికంగా నష్టపోతున్న సంఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి అన్నారు. ఆన్లైన్ మోసాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం వీటిపై ప్రజలకు అప్రమత్తం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. మోసం జరిగితే వెంటనే టోల్ ఫ్రీ 1930 నెంబర్ ఫోన్ చేయాలని సూచించారు. లోన్ అప్లికేషన్ ద్వారా మొదట చిన్న చిన్న మొత్తాల నుండి మొదలుకుని పెద్దమొత్తంలో లోన్స్ ఇచ్చి తరువాత పెద్ద మొత్తంలో మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి లోన్ ఆప్ మోసాలు కరోనా కాలం మొదలైనప్పటి నుండి మొదలైనాయని ఈ విధంగా వివిధ రకాల పద్ధతులలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే మీరు ఎటువంటి లోన్లు తీసుకోనప్పటికీని మీ ఫోన్ లో లోన్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని లాగిన్ అయితే చాలు మీరు అట్టి లోన్ ఆప్ కి ఇచ్చే అనుమతుల వల్ల మీ ఫోన్ లో ఉన్న వివరాలు మొత్తం అనగా మీ యొక్క కాంటాక్ట్స్,గ్యాలరీ లోని ఫోటోస్, వీడియోస్ అలా మన ఫోన్ లో ఉన్న డాటా మొత్తం కూడా సైబర్ నేరగాడి దగ్గరికి చేరతాయని ఇలాంటి లోన్ ఆప్స్ రకరకాల పేర్లతో ఉన్నాయని అలాంటి వాటిలో మీరు లోన్ అప్లై చేసిన తర్వాత వెంటనే మీకు లోన్ చాలా సులువుగా మంజురీ అవుతుందని దీనికి చాలా మంది ఆకర్షితులు అయి లోన్ లు తీసుకుంటున్నారని అలాగే లోన్ కి సంబందించిన మొత్తం డబ్బులు కట్టిన తర్వాత కూడా లోన్ ఆప్ వారి నుండి కాల్స్ వస్తాయని ఇంకా మీరు డబ్బులు కట్టాలని మీ ఇంట్రస్ట్ పెరిగిందని ఇంకా బాకీ ఉన్నారని ఇబ్బందులకి గురి చేయడం అలాగే లోన్ తీసుకున్న వ్యక్తి ఇచ్చిన అనుమతుల వల్ల అతడి కాంటాక్ట్ లో ఉన్న వారి ఫోన్ నంబర్ల తో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అతడి దగ్గర ఉన్న ఫోటోస్ ని ఆ గ్రూప్ లో పోస్ట్ చేయడం, లోన్ తీసుకున్న వ్యక్తి యొక్క కాంటాక్ట్స్ లో ఉన్న వారికి ఫోన్ చేసి లోన్ కట్టడం లేదని చెప్పడం అందరిలో అవమానపాలు చేసేలా చేయడం వల్ల లోన్ తీసుకున్న వ్యక్తులు ఆ బాదలు బరించలేక ఆత్మహాత్యలకు ప్రయత్నించడం చేస్తున్నారని కాబట్టి సాద్యమైనంత వరకులోన్ ఆప్స్ జోలికి వెళ్లొద్దని అన్నారు.
  సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే … పోలీసుల వారి సూచనలు తప్పక పాటించండి
. లోన్ ఆప్స్ ని డౌన్ లోడ్ చేయొద్దు
 ఇంతకు ముందు లోన్ ఆప్స్ ని డౌన్ లోడ్ చేసి ఉంటే వెంటనే అన్ ఇంస్టాల్ చేయాలి.
 లోన్ ఆప్ కి ఎటువంటి అనుమతులను ఇవ్వకూడదు.`
 ఆన్లైన్ లో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.
 అపరిచితుల మాటలు నమ్మి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టకండి, అధిక లాభాల కోసం పరుగులు తీయకండి. ఆన్లైన్లో పెట్టుబడి అంటే మోసమని గ్రహించండి.
 మీరు ఎటువంటి లోన్లు తీసుకోనప్పటికీని లోన్ అప్లికేషన్లలో లాగిన్ అయితే చాలు మీ వివరాలు మొత్తం సైబర్ నేరగాడి దగ్గరికి చేరతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
Attachments area