వజ్రోత్సవం కార్యక్రమాలు 14 రోజులు ఘనంగా నిర్వహిస్తాం జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య….
ఘనంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ….
జాతీయ జెండాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య …
ములుగు బ్యూరో,ఆగస్ట్09(జనం సాక్షి):-
ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య మంగళవారం సందర్శించారు. గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 75వ భారత స్వతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య హాజరై జాతీయ జెండాలు ములుగు పట్టణ కేంద్రంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 75 భారత స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈనెలలో 14 రోజులు పాటు జిల్లా కేంద్రంలో అన్ని మండలాలలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తూన్నామని కలెక్టర్ అన్నారు.జిల్లాలోని 9 మండలాలలో జిల్లా స్థాయి అధికారులను మండల స్థాయి అధికారులను జాతీయ జెండాల ఇంటింటికి పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామన్నారు.జాతీయ జెండా ఎగురవేసేలా మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు ప్రతి మండలంలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేస్తున్నారని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య చేతుల మీదుగా ములుగు సర్పంచ్ బండారు నిర్మల జాతీయ జెండా స్వీకరించారు.జిల్లాలోని అన్ని సినిమా ధియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శింప చేస్తున్నామని విద్యార్థిని విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు కస్తూరిబా విద్యార్థులు సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో ములుగు మండల అభివృద్ధి అధికారి ఇక్బాల్,మండల పరిషత్ అధ్యక్షురాలు గండ్రకోట శ్రీదేవి,ములుగు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బండారి నిర్మల మండల పంచాయతీ అధికారి హనుమంతరావు, కార్యదర్శి మహేందర్, గ్రామపంచాయతీ పాలక మండలి సిబ్బంది, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.