వన్డేల్లో టాప్ ప్లేస్ నిలుపుకున్న ఇంగ్లాండ్
బ్యాటింగ్‌లో అమ్లా , బౌలింగ్‌లో హఫీజ్ నెంబర్ వన్
దుబాయ్ ,సెప్టెంబర్ 6: ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ముగియడంతో ఐసిసి తాజా జాబితాను ప్రకటించింది. దీనిలో ఇంగ్లాండ్ 121 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఆఖరి మ్యాచ్ గెలవడంతో దక్షిణాఫ్రికా కూడా నెంబర్ వన్‌కు చేరువలో ఉంది. ప్రస్తుతం సఫారీ టీమ్ కూడా 121 పాయింట్లతో ఉన్నప్పటకీ… దశాంశమానంలో లెక్కించినప్పుడు ఇంగ్లాండ్‌కు అగ్రస్థానం దక్కింది. టీమిండియా 120 పాయింట్లతో మూడో స్థానంలోనూ , ఆస్టేల్రియా 113 పాయింట్లతో నాలుగో స్థానంలోనూ ఉండగా..శ్రీలంక ఐదు , పాకిస్థాన్ ఆరో ర్యాంకులో నిలిచాయి. అటు వ్యక్తిగత ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే… సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ ఆమ్లా నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఆమ్లా తన టాప్ ప్లేస్‌ను మరింత పటిష్టం చేసుకున్నాడు. ఈ క్రమంలో 900 రేటింగ్ పాయింట్లను కూడా అధిగమించాడు. భారత జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలోనూ , డివిలీయర్స్ మూడు , సంగక్కరా నాలుగో స్థానంలోనూ ఉన్నారు. టీమిండియా కెప్టెన్ ధోనీ ఆరో ర్యాంకు దక్కించుకోగా… ఓపెనర్ గౌతమ్ గంభీర్ తొమ్మిదో ర్యాంకులోనూ నిలిచాడు. బౌలర్ల జాబితాలో పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరో పాక్ బౌలర్ మహ్మద్ హఫీజ్ రెండో స్థానంలో ఉండగా…సౌతాఫ్రికా పేసర్ తొత్సొబే మూడో ర్యాంకులో నిలిచాడు. టాప్ టెన్‌లో భారత్ నుండి స్పిన్నర్ అశ్విన్ ఒక్కడికే చోటు దక్కింది. అశ్విన్ 681 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ ః
1. ఇంగ్లాండ్ – 121 పాయింట్లు
2. దక్షిణాఫ్రికా – 121 పాయింట్లు
3. భారత్ – 120 పాయింట్లు
4. ఆస్టేల్రియా – 113 పాయింట్లు
5. శ్రీలంక – 108 పాయింట్లు
6. పాకిస్థాన్ – 104 పాయింట్లు
7. వెస్టిండీస్ – 94 పాయింట్లు
8. న్యూజిలాండ్ – 74 పాయింట్లు
9. బంగ్లాదేశ్ – 71 పాయింట్లు
10. జింబాబ్వే – 50 పాయింట్లు
11. ఐర్లాండ్ – 35 పాయింట్లు
12. నెదర్లాండ్స్ – 16 పాయింట్లు
13. కెన్యా – 11 పాయింట్లు
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ – బ్యాటింగ్ ః
1. హషీమ్ అమ్లా – దక్షిణాఫ్రికా – 901 పాయింట్లు
2. విరాట్ కోహ్లీ – భారత్ – 858 పాయింట్లు
3. డివిలీయర్స్ – దక్షిణాఫ్రికా – 852 పాయింట్లు
4. సంగక్కరా – శ్రీలంక – 773 పాయింట్లు
5. జొనాథన్ ట్రాట్ – ఇంగ్లాండ్ – 749 పాయింట్లు
6. ఎం.ఎస్. ధోనీ – భారత్ – 745 పాయింట్లు
7. మైకేల్ క్లార్క్ – ఆస్టేల్రియా – 718 పాయింట్లు
8. అలెస్టర్ కుక్ – ఇంగ్లాండ్ – 707 పాయింట్లు
9. గౌతం గంభీర్ – భారత్ – 689 పాయింట్లు
10. మైక్ హస్సీ – ఆస్టేల్రియా – 688 పాయింట్లు
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ – బౌలింగ్ ః
1. సయీద్ అజ్మల్ – పాకిస్థాన్ – 759 పాయింట్లు
2. మహ్మద్ హఫీజ్ – పాకిస్థాన్ – 747 పాయింట్లు
3. తొత్సొబే – దక్షిణాఫ్రికా – 690 పాయింట్లు
4. ఆర్. అశ్విన్ – భారత్ – 681 పాయింట్లు
5. మోర్నే మోర్కెల్ – దక్షిణాఫ్రికా – 676 పాయింట్లు
6. స్టీవెన్ ఫిన్ – ఇంగ్లాండ్ – 668 పాయింట్లు
7. గ్రేమ్ స్వాన్ – ఇంగ్లాండ్ – 661 పాయింట్లు
8. షకీబుల్ హసన్ – బంగ్లాదేశ్ – 655 పాయింట్లు
9. మిల్స్ – న్యూజిలాండ్ – 647 పాయింట్లు
10. డేల్ స్టెయిన్ – దక్షిణాఫ్రికా – 644 పాయింట్లు