వన్ టైం పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

– జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య
 -రెవిన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్ లతో సమీక్ష…
వరంగల్ ఈస్ట్, జూలై 19(జనం సాక్షి):
వన్ టైం పథకాన్ని సద్వినియోగం చేసుకోనెలా చర్యలు తీసుకోవాలని జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జిడబ్ల్యూ ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉప కమిషనర్ లు, రెవిన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్ లతో జరిగిన సమావేశంలో సర్కిల్ ల వారిగా ఓ. టి. ఎస్. రెవిన్యూ వసూలు, పెండింగ్ ఫైల్స్ పై సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సువర్ణాకాశమైన
వన్ టైం (ఓ.టి.ఎస్) పథకాన్ని సద్వినియోగం చేసుకొని2021-22 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిలపై ఉన్న 100 శాతం వడ్డీలో 90 శాతం వడ్డీ మాఫీ, 10% శాతం వడ్డీతో  31 అక్టోబర్ 2022 లోగా  చెల్లించాలని కమీషనర్ నగరవాసులను కోరారు. అందుకు గాను మొండి బకాయిదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ పథకం క్రింద బకాయిదారుల నుండి రూ.21.97 కోట్ల బకాయిలు సేకరించేలా రెవిన్యూ అధికారులు అంకితభావంతో కృషి చేయాలన్నారు. 2021-22 సంవత్సరానికి ఇప్పటివరకు వడ్డీ కట్టిన  వారికి వచ్చే  ఇంటి పన్ను డిమాండ్ బిల్లులో సర్దుబాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ సంవత్సరంరూ.88.59 కోట్ల పన్ను వసూలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 27.77 కోట్ల రూపాయలు వసూలు చేశామని అన్నారు.వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఓ.టి.ఎస్. పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించి ఇట్టి సదావకాశాన్ని వినియోగించుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఆర్.ఓ., ఆర్ ఐ లు రోజు వారి వసూళ్ల పై ప్రత్యేక దృష్టి సారించి నివేదిక సమర్పించాలని,ప్రతి వారం సాధించిన ప్రగతి పై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని,విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓ.టి.ఎస్.పారదర్శకం గా జరిగేలా పర్యవేక్షించాలని డీసీ లను ఆదేశించారు.
   సిటీజన్ చార్టర్ ను పటిష్ఠంగా అమలు చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  ఇంటి నంబర్లు కేటాయింపు, ఆస్తి పేరు మార్పిడి, బైఫర్కేషన్, కొత్త ఆసేస్మెంట్ తదితర
 విజ్ఞాపనలు  వినతులు, సమస్యలను గడువులోగా  పరిష్కరించాలని కమిషనర్ అన్నారు.
 ఇట్టి సమీక్షలో అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, ఉప కమిషనర్  శ్రీనివాస్ రెడ్డి,  ఐటీ రమెష్, రెవిన్యూ అధికారులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.