వయోవృద్ధులను సురక్షిత భవనంలోకి తరలింపు…

..
జనగామ కలెక్టరేట్ జూలై..(జనం సాక్షి):
భారీ వర్షాల వలన వృద్ధాశ్రమ భవనం పైకప్పు నుండి నీరు రావడం వలన వృద్ధులను సురక్షిత భవనంలోకి తరలించినట్లు జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలిపారు.బుధవారం జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డ లోమహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ వృద్ధుల కోసం నడపబడుతున్న రాజరాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్ ను జిల్లా సంక్షేమ అధికారిని జయంతి మరియు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ చింతకింది రాజు సందర్శించి పరిశీలించారు మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి వెళ్ల గా భారీ వర్షాలకు బిల్డింగ్ లొ లీకేజీ నుంచి వర్షం పడుతూ ఉండడం గమనించి కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే వారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కోసము కొత్త భవనాన్ని చూడాలని ఆర్డీఓను ఆదేశించారు.
ఆర్డీవో మున్సిపల్ కమిషనర్ ,సర్కిల్ ఇన్స్పెక్టర్ సహకారంతో రాజరాజేశ్వరి హోం లో ఉన్న వస్తువులన్నింటినీ ట్రాక్టర్ ద్వారా తరలిస్తూ వృద్ధులందరినీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అంబులెన్స్ లో బెడ్ రీడన్ గా ఉన్న వృద్ధులతో పాటు అందరిని సఖి వాహనం ద్వారా సురక్షితంగా కొత్త భవనంలోకి తరలించారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధు మోహన్, జిల్లా సంక్షేమ అధికారిని జయంతి, మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఎమ్మార్వో రవీందర్ , జనగామ సిడిపిఓ రమాదేవి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ యాదవ్ ,ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ చింతకింది రాజు, సఖి సిఏ రేణుక, రాజరాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకురాలు భశపాక రాజేశ్వరి, సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.