వరంగల్లో వైభవంగా వినాయక ఉత్సవాలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 01(జనం సాక్షి)
వరంగల్ నగరంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా వినాయక ఉత్సవాలను నగర ప్రజలు వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని వేలాది వినాయక మండపాల వద్ద భక్తులు వినాయక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. మట్టి వినాయకులనే ప్రతిష్టించాలి ..మట్టి వినాయకుల తోనే పర్యావరణ కాలుష్యం ఉండదని తెలియజేస్తూ పలువురు భక్తులు తమ వినాయక మండపాల వద్ద మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించడం కనిపించింది. అదేవిధంగా భక్తిశ్రద్ధలతో భక్తులు వినాయకుని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పలుచోట్ల భజనలు చేసి తమ భక్తిపారవశాన్ని చాటుకున్నారు. వినాయక మండపాల వద్ద రంగురంగుల విద్యుత్ బల్బులు ఏర్పాటు చేసి పలు సెట్టింగ్లతో భక్తులను ప్రజలను ఆకర్షించే విధంగా ఆయా మండపాల నిర్వాహకులు తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ప్రజలు తమ గృహాల్లో కూడా వినాయకులను పూజించారు. ఆది దేవుడైన ఆ వినాయకుడు అందరిని చల్లగా చూడాలని వేడుకున్నారు