వరదకాల్వ పరిధిలో సాగు చేయరాదు

నిజామాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రస్తుతం ఎస్సారెస్పీ పునర్జీవన పథకం పనులతో పాటూ ఎస్సారెస్పీలో అనుకున్న స్థాయిలో నీరు లేకపోవడంతో ఈసారి వరద కాలువ పరిసరాల్లో యాసంగి పంటలు పండించేందుకు అనుకూలం కాదని అధికారులు అన్నారు. శ్రీరాంసాగర్‌ పునర్జీవన పథకం

పనులతో పాటూ పోచంపాడ్‌లోని ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీరు లేదన్నారు. అందువల్ల యాసంగికి వరద కాలువ పరిసరాల్లో సవిూప రైతులు పంటలను సాగు చేయవద్దని కరీంనగర్‌ ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్‌ అనిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో సూచించారు. ఖరీఫ్‌ సీజన్‌లో వరద కాలువలో నీటిని నిల్వ చేయడంతో రైతులు వరద కాలువ పరిసరాల్లో పంటలను సాగు చేశారని గుర్తు చేశారు. పునర్జీవన పథకంతో భాగ గా మూడు లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మల్యాల మండలం రాంపూర్‌, మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట, ఎస్సారెస్సీ డ్యాం సవిూపంలోని మండలంలో పనులు జరుగుతున్నాయని తెలిపారు.