వరద ప్రాంతాన్ని పరిశీలించిన సింగరేణి అధికారులు ప్రజాప్రతినిధులు

పినపాక నియోజకవర్గం జూలై 23 (జనం సాక్షి): మణుగూరులో శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా సింగరేణి పీకే ఓ సి ఫోర్ నుంచి భారీ వరదనీరు రావడంతో సురక్ష బస్టాండ్, శేషగిరి నగర్, భగత్ సింగ్ నగర్ లోని ఇండ్లలోకీ నీరుచేరి ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు తక్షణమే స్పందించిన మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు వెంటనే సింగరేణి ప్రధాన అధికారి జక్కం రమేష్ ప్రాజెక్ట్ అధికారి లక్ష్మీపతి గౌడ్ తో మాట్లాడి వారితో కలిసి శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించారు. సింగరేణి ఓసి ఫోర్ నుంచి వరద రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఇలాంటి సమస్య మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో మణుగూరు ఎంపీపీ కారం విజయ కుమారి సింగరేణి జనరల్ మేనేజర్ జక్కం రమేష్ డీజిఎం సివిల్ వెంకటేశ్వర్లు ఓ సి ఫోర్ ప్రాజెక్ట్ అధికారి లక్ష్మీపతి గౌడ్ ఈ ఈ నర్సిరెడ్డి ప్రాథమిక పరపతి సంఘం అధ్యక్షులు కురి నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ మండల పట్టణ అధ్యక్షులు ముత్యం బాబు అడపా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.