వరద బాధితులకు అండగా భాజపా యువనేత
బ్యూరో, జూలై,,జనంసాక్షి,,, గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ ముంపు కు గురైన కుటుంబాలకు కనీస ఆహార సామాగ్రి లేకపోవడం తో బిజిపి యువమోర్చా స్టడీ సర్కిల్ జిల్లా ఇంచార్జి కుమ్మరి వెంకటేష్ ఆధ్వర్యంలో చించొలి B గ్రామంలో 15 కుటుంబాలకు ఆహార సామాగ్రి సామాగ్రి ని ఆందజేశారు, అదే విధంగా బీజేపీ నాయకులు, గ్రామంలోని యూవత గ్రామంలో పర్యటించి పరిస్థితుల ను అడిగి తెలుసుకున్నారు, వాతావరణ శాఖ వారు రానున్న మరో మూడు రోజులు భారీ వర్షాల సూచనలు ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు, ఏవైనా సమస్యలు ఎదురైతే తమ సభ్యుల కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,భూపతి ,పవన్, దినేష్ ,యశ్వంత్ ,గణేష్ , లక్ష్మణ్, రాము , ప్రణయ్ ,బన్నీ రాజు తదితరులు పాల్గొన్నారు.