వరద బాధితులకు తక్షణ సాయం క్రింద నిత్యవసర సరుకులు, బియ్యం అందజేసిన విప్ రేగా….

బూర్గంపహాడ్ జూలై 22(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీలు గోదావరి వరదలతో ముంపుకు గురవడంతో నష్టపోయిన వరద బాధిత కుటుంబాలందరికి స్థానిక అంగన్ వాడి సబ్ సెంటర్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం క్రింద అందజేసే 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను స్థానిక జిల్లా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి, టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి, కోయగూడెం సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి, మండల టిఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి, కొనకంచి శ్రీను, సోము చైతన్య రెడ్డి, తిరపతి ఏసుబ్, గుల్ మహమ్మద్, చల్లకోటి పూర్ణ  అధికారులు పాల్గొన్నారు.