వరల్డ్ స్క్వాష్ మీట్‌లో భారత కెప్టెన్‌గా దీపిక
నల్యిడ్థిల్లీ, న|్శబ్ 10 :మహిళల వరల్డ్ స్క్వాష్ టీమ్ ఛాంపియన్‌షిప్‌కు అంతా సిధ్దమైంది. నవంబర్ 12 నుండి 17 వరకూ జరిగే ఈ టోర్నీకి ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తోంది. ఈ సారి రికార్డ్ స్థాయిలో మొత్తం 26 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు సారథిగా స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఎంపికైంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ ర్యాంకులో ఉన్న దీపికతో పాటు జట్టులో జోత్స్న చిన్నప్ప , ఆసియా జూనియర్ ఛాంపియన్ అనక అలంకమోని , జూనియర్ నెంబర్ టూ అపారాజిత ఉన్నారు. టీమ్‌కు సైరస్ పోంచా , మాజ్ , మానియం కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. 2010లో జరిగిన వరల్డ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్క్వాష్ జట్టు 10వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని కోచ్ పోంచా చెబుతున్నారు. ఈ సారి 10వ సీడ్‌గా బరిలోకి దిగుతోన్న క్వార్టర్ ఫైనల్ చేరాలంటే పటిష్టమైన ఐర్లాండ్ , అర్జెంటీనాలను ఓడించాల్సి ఉంటుంది.
వరల్డ్ స్క్వాష్ టీమ్ ఛాంపియన్‌షిప్ సీడింగ్స్ ః
పూల్ ఎ – ఇంగ్లాండ్ (1) , స్కాట్లాండ్ (16) , రిపబ్లిక్ ఆఫ్ కొరియా (23)
పూల్ బి – ఈజిప్ట్(2) , వేల్స్ (15) , మెక్సికో (24)
పూల్ సి – మలేషియా(3) , దక్షిణాఫ్రికా(14) , చైనా(19) , స్పెయిన్
పూల్ డి – హాంకాంగ్ (4) , చెక్‌రిపబ్లిక్(13) , కొలంబియా(20) , నవిూబియా(25)
పూల్ ఈ – న్యూజిలాండ్ (5) , యుఎస్‌ఎ (12) , జపాన్
పూల్ ఎఫ్ – ఆస్టేల్రియా (6) , కెనడా (18) , ఆస్టియ్రా (18)
పూల్ జి – ఐర్లాండ్ (7) . భారత్ (10) . అర్జెంటీనా (17)
పూల్ హెచ్ – నెదర్లాండ్స్ (8) , ఫ్రాన్స్ (9) , జర్మనీ (21)