వర్షంలోనే సిఎం కేసీఆర్ పర్యటన..

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేందుకు నిన్న వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ఉదయం భద్రాచలం పర్యటనకు బయలుదేరారు. వర్షాలు కురుస్తుండటంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేను అధికారులు రద్దుచేసిన నేపథ్యంలో బాధిత ప్రజలకు చేరుకోవడానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. ములుగు, ఏటూరునాగారం మీదుగా వరద పరిస్థితులను వీక్షిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకుంటూ భారీ వర్షంలోనే సీఎం కేసీఆర్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగుతున్నది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ తో సహా ప్రయాణిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారుల బృందం భద్రాచలానికి చేరుకోనున్నారు. అక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను సిఎం కెసిఆర్ పరిశీలించనున్నారు.