వర్షంలో సైతం ప్రజల బాగోగులు చూసుకుంటున్న మండల నాయకులు , అధికారులు

రుద్రూర్ (జనంసాక్షి): రాష్ట్రంలో
మరియు రుద్రూర్ మండలం కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండల నాయకులు , అధికారులు వర్షంలో సైతం గొడుగులు పట్టుకొని రుద్రూర్ మండలం లోని అన్ని గ్రామాల్లోని కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా పర్యటించి ప్రజల ఇబ్బందులను, పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. మండలం లోని ఆయా గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివసించే వారిని వెంటనే ఖాళీ చేయించి, పాఠశాలల్లో మరియు ప్రభుత్వ భవనాలకు తరలించి, వారికి తగు నివాసాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా తెరాస మండల నాయకులు మాట్లాడుతూ
ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలోకి ప్రజలెవరూ దిగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.భారీ వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కరించేలా చూడాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయట కు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నారోజి గంగారాం , తహసిల్దార్ మూజీబ్, మండల నాయకులు అక్కపల్లి నాగేందర్, మండల తెరాస అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్,
విండో చైర్మన్ సంజీవ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ లు, ఇతర నాయకులు , అధికారులు వున్నారు