వర్షాకాలంలో ” కరెంట్ ” తో జాగ్రత్త

పినపాక నియోజకవర్గం జూన్ 28( జనం సాక్షి): మణుగూరు మండలంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పట్టణాల్లో విద్యుత్ స్తంభాలు తడిసి విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏ డి ఈ  జీవన్ కుమార్ మాట్లాడుతూ. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. గాలి దుమారాలకు చెట్లు, కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడటం వల్ల పశువులు, రైతులు మృత్యువాత పడుతున్నారు. రైతులు పగటిపూట రాత్రివేళల్లో పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. మండల పరిధిలో ఉన్న విద్యుత్ సమస్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం అవసరం ఉన్నచోట ప్రమాదభరితంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్ ల చుట్టూ కంచె ఏర్పాటు చేశాము. విద్యుత్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం గ్రామాలలో పట్టణాలలో ప్రజలకు ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే సంబంధిత విద్యుత్ శాఖాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.