వలస కార్మికుల సమస్యలపై సిఐటియు సర్వే

— వలస కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారు
— కార్మికులకు పరిశ్రమల్లో కనీస వసతులు కల్పించాలి
— లేనియాడల ఆందోళనకు సిద్ధం అవుతాం… సిఐటియు
మహబూబ్ నగర్ ఆర్ సి ,జులై 15 ( జనంసాక్షి ) : పోలేపల్లి సెజ్ పరిధిలోని పలు పరిశ్రమల్లో సిఐటియు జిల్లా కమిటీ అధ్వర్యంలో శుక్రవారం సర్వే నిర్వహించారు .ఇందులో పలు పరిశ్రమలో పనిచేస్తున్న బీహార్ ,ఒరిస్సా, మధ్యప్రదేశ్ ,రాజస్థాన్ ,ఝార్ఖండ్ ,బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులను అనేక పరిశ్రమల్లో దినసరి కార్మికులుగా కుటుంబాలతో సహా వచ్చారని టేకేదారులు వాళ్ళని తెచ్చి వారితో పని చేస్తున్నారని తెలిపారు .ఎం ఎం ఇండస్ట్రీ ,రాయల్ ఇండస్ట్రీ సి ఫోల్డ్ అనేక పరిశ్రమల్లో, పరిశ్రమల ముందు రేకుల షెడ్లు వేయించి అందులో కార్మికుల కుటుంబాల నుంచి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా నీళ్లు బాత్రూం లాట్రిన్ రూమ్ సౌకర్యం లేకుండా బహిర్భూమికి ఆరు బయటకు వెళ్తున్న మహిళలు వాళ్ళ బాధలు వివరించారని కనీస వేతనాలు అమలు చేయకుండా దినసరి కార్మికులుగా రోజుకు 200 నుండి 290 వరకు ఇస్తూ యాజమాన్యాలు వారితో శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని తెలిపారు .సుదూర ప్రాంతాల నుంచి నిర్మాణరంగం కోసం తాపీ మేస్త్రీలను అడ్డా కూలీలుగా, పారగాళ్లు ,మాలు అందించే మహిళా కార్మికులను తీసుకొచ్చి రోజుకు 12 గంటలు పని చేస్తున్నారని. వారిలో ఎవరికీ కనీసమైన భద్రత ఏర్పాట్లు లేకుండా పిఎఫ్ ఎస్ఐ గ్రాటిటి ఎలాంటివి లేకుండా టేకేదారులు మధ్యవర్తులు లేబరు తెచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి సిఐటియూ మండల ఇన్చార్జి తెలుగు సత్తన్న తెలిపారు .ఈ సర్వే ద్వారా అనేక అంశాలు బయటకు వచ్చాయని పోలేపల్లి సేజ్ పరిధిలో లేని అనేక పరిశ్రమల్లో కార్మికులను నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని మధ్యవర్తులు కాంట్రాక్టర్లు యాజమానులు లాభాలు గడిస్తూ కార్మికులను దోపిడీ చేస్తున్నారని తెలిపారు . ఫార్మా కంపెనీ యాజమాన్యాలు ఇస్తున్న మామూళ్లకు అలవాటు పడిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు జిల్లా లేబర్ అధికారులు పరిశ్రమల అధికారులు ఎవరు కూడా ఫ్యాక్టరీలను విజిట్ చేయడం లేదని .సిఐటియూ నాయకులు విమర్శించారు . సేజ్ పరిధిలోని పరిశ్రమల్లో పనిచేసే దినసరి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పర్మనెంట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వలస కార్మికుల సమస్యలపై సిఐటియు ఆందోళనకు సిద్ధమవుతుందని పరిశ్రమల యజమానులను కాంట్రాక్టర్లను వారు హెచ్చరించారు. కార్మికులందరికీ అవసరమైన విశ్రాంతి గృహాలను సేజ్ పరిధిలో నిర్మించాలని వలస కార్మిక కుటుంబాలకు సెజ్ పరిధిలో పాఠశాల నిర్మించాలని .లేబర్ అధికారులు నిరంతరం విజిట్ చేసి కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు .కనీస వేతనము 26000 ఇవ్వాలని అన్ని రకాల సౌకర్యాలు కార్మికులు కల్పించాలని పెన్షన్ పిఎఫ్ ఈఎస్ఐ తదితర సౌకర్యాలు తక్షణమే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ..
Attachments area
 

తాజావార్తలు