వస్త్ర పరిశ్రమ (ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ వేయాలి) వరంగల్
సూరత్‌ను తలదన్నాలి
మైసూర్ ఉత్సవాల తరహాలో కాకతీయ ఉత్సవాలు
ఐటీ మొదలగు పరిశ్రమలు వరంగల్‌కు తరలాలి
వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ సమీక్ష
వరంగల్,డిసెంబర్29(జనంసాక్షి): భారతదేశ వస్త్ర పరిశ్రమ అంతా ఒకేచోట ఉండే విధంగా దేశంలోని అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన టెక్స్‌టైల్స్ పార్కును వరంగల్‌లో నెలకొల్పుతామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. సూరత్‌లో దొరికే చీరలు, షర్ట్ సల్వార్ మెటీరియల్, తిర్పూర్‌లో దొరికే రెడిమేడ్ వస్తువులు, షోలాపూర్‌లో లభ్యమయ్యే చద్దర్లు అన్ని ఒకేచోట లభ్యమయ్యే విధంగా వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌ను నెలకొల్పాలి. టెక్స్‌టైల్స్ పార్క్‌లో తయారైన వస్తువులను మార్కెట్ చేయడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. పరిశ్రమకు అనుబంధంగా టౌన్‌షిప్ డెవలప్ చేయాలి. హైదరాబాద్ తరువాత వరంగల్ నగరం రెండవ అతిపెద్ద నగరమని, దీనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుత ట్రాఫిక్ రద్దీని తట్టుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరంగల్‌లోని రహదారులను, జంక్షన్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాకతీయ ఉత్సవాలు కూడా కేవలం వరంగల్‌కే పరిమితం కాకుండా దేశ ప్రజలందరూ గుర్తించేలా నిర్వహించాలని చెప్పారు. వరంగల్ కార్యాలయంలో నగరంలోని రహదారులు, జంక్షన్ల అభివృద్ది, కాకతీయ ఉత్సవాల నిర్వహాణ, టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు అంశాలపై ముఖ్యమంత్రి సవిూక్ష నిర్వహించారు. ఎంపిలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నుండి సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ విూడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో అతిపెద్ద నగరమని అన్నారు. భారతదేశ వస్త్ర పరిశ్రమంతా ఒకే చోట ఉండే విధంగా అత్యున్నత ప్రమాణాలతో వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వరంగల్‌లోని రహదారులు, జంక్షన్లను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. కాకతీయ ఉత్సవాలు వరంగల్‌కే పరిమితం కాకుండా దేశప్రజలంతా గుర్తించేలా నిర్వహించాలని సూచించారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్‌లో నగరంలోని రహదారులు, జంక్షన్ల అభివృద్ధి, కాకతీయ ఉత్సవాల నిర్వహణ, టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు అంశాలపై సీఎం సవిూక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటి సిఎం డా.రాజయ్య,మంత్రులు ఎ.చందూలాల్,జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు,కలెక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఇప్పటికే కిక్కిరిసి పోయిందని, దీంతో కొత్తగా వచ్చే యూనివర్సిటీలు, సంస్థలు, ఐటి కంపెనీలను వరంగల్‌కు తరలిస్తామన్నారు. దీనివల్ల వరంగల్ నగర జనాభా కొద్ది సంవత్సరాల్లోనే రెట్టింపు అవుతుందని, .20లక్షల జనాభా జీవనం సాగించడానికి అనువుగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దాల్సి ఉందన్‌ఆనరు. రాంపూర్‌నుండి హన్మకొండ చౌరస్తా,పోచమ్మ మైదాన్ ద్వారా వరకు ఉన్న ప్రధాన రహదారిని 150 ఫీట్ల మేరకు విస్తరించాలి. హంటర్ రోడ్, ఆర్‌ఇసి-కేయుసి-పెద్దమ్మ గడ్డ రహదారిని 150 ఫీట్ల మేర వెడల్పు చేయాలి. ఆరోడ్ల వెంట
వాకింగ్,బైస్కిల్ పాత్‌లను నిర్మించాలి. కడిపికొండ రహదారిని, ఖాజిపేట రైల్వే స్టేషన్ పక్క నుండి వరంగల్ హంటర్ రోడ్ ఆర్‌ఓబి రహదారిని, కరీంగర్ రహదారిని బాగా విస్తరించాలి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్,ములుగు రోడ్,పోచమ్మ మైదాన్ లాంటి జంక్షన్ల వద్ద మల్టి లేవల్ సపరేటర్స్ నిర్మించాలి. మొత్తం రహదారుల అభివృద్దిని యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. వేల సంఖ్యలో చెరువులు నిర్మించి అన్నం పెడుతున్న కాకతీయ సామ్రాజ్యపు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేంత ఘనంగా కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో కాకతీయ ఉత్సవాలు జరపాలి. కేవలం వరంగల్‌కే ఉత్సవాలు పరిమితం కావద్దు. తెలంగాణలోని పది జిల్లాల్లో ఉత్సవాలు జరపాలి. గోల్కొండ కోట కట్టింది. కూడా కాకాతీయులే కాబట్టి అక్కడ కూడా ఉత్సవాలు జరపాలి. లక్నవరం,రామప్ప,ఘనపురం,పాకాల లాంటి చెరువులను ఆకర్శనీయంగా తిర్చిదిద్ది వాటిలో కాకతీయ ఉత్సవాల సందర్భంగా రెజ్లింగ్ పోటీలు, పడవ పందాలు నిర్వహించాలి. కాకతీయ ఉత్సవాల్లో ప్రజలందరిని భాగస్వాములను చేయాలి. విద్యార్ధులకు సాంస్కృతిక, సాహిత్య అంశాల్లో పోటీలు నిర్వహించాలి. కళాకారులు, క్రీడాకారులు, డాక్టర్లు,చరిత్ర కారులు ఇలా అందరికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయలి. కవి సమ్మేళనాలు, అవధానాలు ఏర్పాటు చేయాలి. వరంగల్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి. లేజర్‌షోలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక ప్రచురణలు, డాక్యుమెంటరీలు తీసుకురావాలి. జిల్లా వ్యాప్తంగా క్రీడోత్సవాలు నిర్వహించాలి. ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాములను చేసేందుకు తెలంగాణ ప్రవాసి దివస్,వైబ్రంట్ తెలంగాణ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాకతీయ ఉత్సవాలకు బస్తర్లో ఉన్న కాకతీయుల వారసులు కమల్‌చంద్ర బంజ్ దేవ్‌ను అధికారికంగా ఆహ్వానించాలి. పేరిణి నృత్యానికి పూర్వ వైభవం తేవాలన్నారు. మైసూర్‌లో దసరా ఉత్సవాలు నిర్వహించినట్లే కాకతీయ ఉత్సవాలు జరపాలి. ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి,మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఒకరోజు వరంగల్‌లోనే ఉండాలి. పార్లమెంట్‌లో ఝాన్సరాణి ఫోటో ఉన్నట్లే రాణి రుద్రమ దేవి ఫోటో కూడా ఉండాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపుతామన్నారు. పోతన,పాల్కురికి సోమనాద్రి పేర్లవిూద కూడా ఉత్సవాలు నిర్వహిస్తాం. బమ్మెరలోని పోతన దున్నిన నాలుగు ఎకరాల స్థలంలో స్మారక కట్టడం ఏర్పాటు చేస్తామన్నారు. కాకతీయులు అందించిన చెరువులను పునరుద్దరించడానికి మిషన్ కాకతీయ కార్యక్రమం చేపడుతున్నాం. ఎస్‌ఆర్‌ఎస్‌పి, దేవాదుల, కంతణపల్లి లాంటి ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపే సాధ్యాసాధ్యాలపై నీటి పారుదల శాఖాధికారులు అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. మిషన్ కాకతీయ ప్రారంభానికి సూచికగా హన్మకొండలోని వడ్డేపల్లి చెరువు వద్ద పైలాన్ ఏర్పాటు చేస్తామని సిఎం అన్నారు. ఇందులో భాగంగా రింగ్‌రోడ్డు, రహదారుల నిర్మాణ,టెక్స్‌టైల్స్ పార్క్‌కు అనువైన స్థలం కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ధర్మసాగర్ మండలం దేవనూర్ సవిూపంలోని అటవిఈ ప్రాంతాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు.