వస్త్ర వ్యాపారులకు ఊరట

వ్యాట్‌ నుంచి మినహాయింపునకు
సర్కారు సుముఖం
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) :
వస్త్ర వ్యాపారులకు ఊరట ఎట్టకేలకు ఊరట లభించింది. వ్యాట్‌ రద్దు చేయాలని వస్త్రవ్యాపారులు కొద్ది రోజులుగా చేస్తున్న డిమాండ్‌ పై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వస్త్ర వ్యాపారులపై విధించిన వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రద్దు చేసింది. ఆదివారం వస్త్ర వ్యాపార ప్రతినిధులు, మంత్రుల బృందం మధ్య చర్చలు జరిగాయి. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలలోని వస్త్ర వ్యాపారుల పై వ్యాట్‌ పస్ను విధించడం లేదని వస్త్ర వ్యాపారులు వాదిస్తూ వచ్చారు. 2010లో తాను పదవి చేపట్టిన నాడు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ విధించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వస్త్ర వ్యాపారుల      ప్రతినిధులకు చెప్పారు. ప్రభుత్వానికి రు.8,000 నుంచి, రూ.9000కోట్ల వరకు బకాయిలు ఉన్నాయాని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం రూ.30,000 కోట్లను ఖర్చు పెడుతుందని చెప్పారు. వ్యాట్‌ రద్దు చేసినందుకు వస్త్ర వ్యాపారులు ముఖ్య మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.