వాగులు,చెరువుల వద్దకు ఎవరు వెళ్లకూడదు…….

టేకుమట్ల..గత ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండుకుండల్లా మారాయి.మండలంలోని గరిమిల్లపళ్లి పెద్ద చెరువు పూర్తిగా నిండగా చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని గ్రహించిన సర్పంచ్ నల్లబెల్లి రమ రవీందర్,తహసీల్దార్ రామారావు,ఎస్సై తామషా రెడ్డిల సహకారంతో జెసిబి సహాయంతో మత్తడి నుండి ఎక్కువ నీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు.అలాగే వర్షాల వల్ల ఎవరూ బయటకు రాకుండా ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకు కోరారు.అత్యవసర సమయాల్లో మాత్రమే బైటికి రావాలని వర్షాల వల్ల ఎవరైన ఇబ్బందులూ ఎదుర్కొంటే గ్రామ పంచాయతీలో పునరావాసం కల్పించడం జరుగుతుందని అదేవిధంగా  మత్స్యకారులు చేపల వేటకు చెరువులు, వాగులు,కుంటల వద్దకు వెళ్లకూడదని  సర్పంచ్ రమ రవీందర్,తహసీల్దార్ రామారావు,ఎస్ఐ తమాషా రెడ్డి ప్రజలను కోరారు.
Attachments area