వాచర్ల పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలి
..తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బాల్య నాయక్
పానుగల్ అక్టోబర్12,జనంసాక్షి
మండలంలో పని చేస్తున్న వాచర్ల పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలని తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు బుధవారం రోజు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బాల్య నాయక్ మాట్లాడుతూ మండలంలోని ఉపాధి కూలీలకు మూడు నెలల నుండి ప్రభుత్వం కూలీ డబ్బులు చెల్లించలేదన్నారు. మూడు నెలల నుండి పని చేస్తున్నా వాచర్లు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే పని చేసేది ఎలాగని ప్రశ్నించారు. సుమారు 150 మంది పైగా వాచర్లు పని చేస్తున్నారని,నర్సరీ, ప్రకృతి వనరులు, చెట్లను రక్షించడానికి వాచర్లను ప్రభుత్వం నియమించిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద దినసరి కూలీపని చేస్తున్నా 90 రోజులు అవుతున్నప్పటికీ కూలీలకు డబ్బులు చెల్లించలేదని, కూలీలు పెండింగ్ డబ్బులు చెల్లించాలని అడుగుతే అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని,ఈ అంశం పై జిల్లా పీడీ స్పందించి, పని చేస్తున్న వాచర్లకు పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.లేనియెడల జిల్లా పి డి కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న వాచర్లు సోమ్లా నాయక్ నరసింహ,రాములు,కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.