.వాజ్‌పేయి, మదన్‌ మోహన్‌ మాలవ్యాలకు భారతరత్న పురస్కారాలు

-కేంద్ర మంత్రివర్గ నిర్ణయం1

-రాష్ట్రపతికి సిఫారసు..ఆమోదం

న్యూఢిల్లీ,డిసెంబర్‌24(జనంసాక్షి): ఓ ఇద్దరు మహామహులు, మేరు నగధీరులు అయిన వ్యక్తులు అత్యున్నత భారత రత్నాలకు ఎంపికయ్యారు. ఆ ఇద్దరూ హిమవన్నగమంత చరిత్రను సంతరించుకున్న వారు. అజాత శత్రువులుగా పేరున్న మహామహులను ఇందుకు ఎంపిక చేయడం విశేషం. ఇద్దరి జన్మదినం డిసెంబర్‌ 25 కావడం యాదృచ్ఛికం. అలాగే ఇద్దరూ యూపికి చెందిన వారే కావడం గమనార్హం. ఒకరు మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి అయితే మరొకరు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్తాపకుడైన మదన్‌ మోహన్‌ మాలవ్య. భాజపా అగ్రనేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన స్వాంతంత్య సమరయోధుడు, విద్యావేత్త పండిత మదన్‌మోహన్‌ మాలవ్యకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను కేంద్రం  ప్రకటించింది. ఈ మేరకు వీరికి భారతరత్న ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫారసు చేసింది.ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం  ఉదయం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీజేపీ అగ్రనేత, భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయికు దేశ అత్యున్న పురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది. బుధవారం ఉదయం ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించి రాష్ట్రపతికి సిఫార్సు చేయగా అందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ఆమోదం తెలిపారు. వాజ్‌పేయితో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త పండిత మదన్‌మోహన్‌ మాలవ్యకు భారతరత్నను ప్రకటించింది.  గురువారం వాజ్‌పేయి 90వ పుట్టిన రోజు కాగా, మాలవ్య జయంతి కూడా కావడం విశేషం. ఈ ఇద్దరూ డిసెంబర్‌ 25ననే జన్మించడం విశేషం. నిబద్దత కలిగిన రాజకీయనేతగా, మ్చలేని మహామనిషిగా భారత రాజకీయాల్లో వాజ్‌పేయ్‌ ముందున్నారు. దేశ అత్యున్నత పురస్కారం దక్కించుకున్న బీజేపీ తొలి నేతగా వాజపేయి నిలిచారు. ఆయన 1924 డిసెంబర్‌ 25న ఆగ్రా దగ్గర బదేశ్వర్‌లో జన్మించారు. దేశానికి వాజ్‌పేయి పదో ప్రధానిగా పనిచేశారు. 1996లో 13 రోజులు, 1998-1999 మధ్య 13 నెలలు, 1999-2004 వరకూ వాజయ్‌ ప్రధానిగా పనిచేశారు. తొమ్మిది సార్లు లోక్‌సభకు ఎన్నికైన వాజ్‌పేయి, రెండు సార్లు రాజసభ సభ్యత్వం తీసుకున్నారు. నాలుగు రాష్టాల్ర నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక నేతగా వాజ్‌పేయి చరిత్రలో  నిలిచారు. మొరార్జీ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వాజ్‌పేయి ఆనాడు చైనా సందర్శనతో ఇరు దేశాల మధ్య స్నేహవారధికి పునాది వేశారు.  ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆద్వానీ , షెకావత్‌తో కలిసి వాజ్‌పేయి బీజేపీని స్థాపించారు. చివరకు ఆరోగ్య సమస్యలతో 2005లొ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 1996లో తొలిసారిగా వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంఖ్యాబలం లేక 13 రోజులకే ప్రధాని పదవి నుంచి దిగిపోయారు.1998లో రెండోసారి ప్రధానిగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామి అయిన అన్నాడీఎంకే తన మద్దతు ఉపసంహరించుకోవడంతో  ప్రధాని పీఠం నుంచి వైదొలిగారు. 1999లో  మూడోసారి  ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. 2004 వరకు ఆయన  ప్రధానిగా కొనసాగారు. ఆ సమయంలోనే పోఖ్రాన్‌ అణుపరీక్షలు నిర్వహించారు. భారత్‌, పాక్‌లమధ్య చోటు చేసుకున్న కార్గిల్‌ యుద్ధం కూడా ఆయన హయాంలోనే జరిగింది.మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాత్రమే మూడు సార్లు ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అలాగే వాజ్‌పేయి కూడా మూడు సార్లు ప్రధాని పీఠం అధిష్టించారు.1992లో పద్మవిభూషణ్‌, 1993లో కాన్పూర్‌ వర్సిటీ డీలిట్‌ గౌరవ పురస్కారం, 1994లో లోకమాన్యతిలక్‌ పురస్కారం, 1994లో గోవింద్‌ వల్లభ్‌పంత్‌ అవార్డును వాజ్‌పేయిను వరించాయి. భారతరత్న పురస్కారం అందుకోనున్న మరో ప్రముఖుడు దివంగత నేత, విద్యావేత్త పండిత మదన్‌మోహన్‌ మాలవ్య 1861లో అలహాబాద్‌లో జన్మించారు. పాత్రికేయుడిగా, న్యాయవాదిగా ప్రసిద్ధికెక్కిన మాలవ్య హిందూస్థాన్‌, ది ఇండియన్‌ యూనియన్‌ పత్రికలను స్థాపించారు. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మాలవ్య రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కాంగ్రెస్‌ తరపున పాల్గొన్నారు. 1909, 1918లో కాంగ్రెస్‌ అధ్యుక్షుడిగా కూడా మాలవ్య బాధ్యతలు నిర్వహించారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయాన్ని మాలవ్య స్థాపించారు. సత్యమేవ జయతే నినాదాన్ని ప్రచారం చేసిన మాలవ్య 1946లో స్వాతంత్య్రానికి పూర్వమే పరమపదించారు.

అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రస్థానం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సవిూపంలోని బదేశ్వర్‌లో 1924 డిసెంబరు 25న వాజ్‌పేయీ జన్మించారు.

అటల్‌ తండ్రి శ్రీకృష్ణ బిహారి, తల్లి కృపాదేవి.  వాజ్‌పేపేయీ రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. సంస్కృతి, జాతి పునర్‌  వైభవం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. దేశసేవకుఅంకితమయ్యేందుకు బ్రహ్మచారిగా ఉండిపోయారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. 1951లో జనసంఘ్‌ ఏర్పాటు 1968లో జనసంఘ్‌ అధ్యక్షుడిగాబాధ్యతలు చేపట్టారు.  31 ఏళ్ల వయసులోనే లోక్‌సభకు ఎన్నిక మొరార్జీ దేశాయ్‌ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా అనుభవంజనతా విచ్ఛినంతో అద్వానీషెకావత్‌లతోకలిసి 1980లో బిజెపి ఏర్పాటు  1996లో తొలిసారి ప్రధానిగా ప్రమాణం1999లో ప్రధానిగా మూడోసారి ప్రమాణం  2004 వరకు అటల్‌ దేశానికి ప్రధానిగా బాధ్యతలు 2005లో వాజ్‌పేయీ క్రియాశీలరాజకీయాల నుంచి నిష్కమ్రణ

మదన్‌ మోహన్‌ మాలవ్య జీవిత విశేషాలు

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో మాలవ్య 1861 డిసెంబరు 25న జన్మించారు.

తండ్రి బ్రిజ్‌నాథ్‌, తల్లి మూనాదేవి.

అలహాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

అలహాబాద్‌ హైకోర్టులో న్యాయవాదిగా గుర్తింపు పొందారు.

1886లో మాలవ్య రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.

1887లో నేషనలిస్ట్‌ వీక్లీ ఎడిటర్‌గా పనిచేశారు.

1907లో అభ్యుదయ వేదిక, మరియాద హిందీ వారపత్రిక ప్రారంభం

బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారు.

1919- 39 మధ్య బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం వీసీగా బాధ్యతలు నిర్వహణ

మకరంద్‌ కలం పేరిట పద్యాలు రాశారు.

1928లో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా పోరాటం

1924-46 మధ్య హిందుస్థాన్‌ టైమ్స్‌ చైర్మన్‌గా బాధ్యతలు

1941లో గోరక్ష మండల్‌ను స్థాపించారు.

చిల్మరీల్మరా అల్లర్ల కేసులో ఉరిశిక్ష పడిన నిందితుల తరపున వాదించారు.

మాలవ్య 1946 నవంబరు 12న వారణాసిలో కన్నుమూశారు.