వాటర్‌గ్రిడ్‌ పూర్తయితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు

4

60ఏళ్లలో మంచినీరందించని మీరా మాట్లాడేది

కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జనంసాక్షి): వాటర్‌ గ్రిడ్‌పై కాంగ్రెస్‌ నేతలు కాంగ్రెస్‌ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని మంత్రి కేటీఆర్‌ అన్నరు. రూ.10 వేల కోట్లలోనే ఇంటింటికి తాగునీరు ఇవ్వొచ్చని కాంగ్రెస్‌ నేతలు అంటున్నరని, రూ.10 వేల కోట్లతోనే రాష్ట్రానికి మంచినీరు సరఫరా చేసే ప్రణాళిక ఉంటే కాంగ్రెస్‌ పార్టీ ఇన్ని రోజులు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టలేదని కేటీఆర్‌ ప్రశ్నించింన్రు. 60 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ ఏ ఒక్క రాష్ట్రానికైనా ఇంటింటికీ నీళ్లిచ్చారా..? అని మంత్రి కేటీఆర్‌ అడిగింన్రు. ఉత్తమ్‌కుమార్‌, జానారెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి హితవు పలికింన్రు. కేవలం చిత్తూరు జిల్లాకే నీటి సరఫరా కోసం 7వేల కోట్లు రూపాయలు విడుదల చేయలేదా..? అని కేటీఆర్‌ ప్రశ్నించింన్రు. ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీలకే కాంట్రాక్టు ఇచ్చినం అని మంత్రి కేటీఆర్‌ అన్నరు. కాంగ్రెస్‌ నేతలు జేబులు నింపుకున్నరు తప్ప.. ప్రజలకు నీళ్లు ఇవ్వలేదని చెప్పింన్రు. మూడేళ్లలో వాటర్‌ గ్రిడ్‌ పనులు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ మాట ఇచ్చారని అన్నరు. జలయజ్ఞంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని కేటీఆర్‌ చెప్పింన్రు. టెండర్లలో జాతీయ కంపెనీలు పాల్గొన్నయని మంత్రి కేటీఆర్‌ తెలిపింన్రు. వాటర్‌గ్రిడ్‌పై కాంగ్రెస్‌ పెద్దలు అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించింన్రు.