వానలు శుభానికే సూచకం

ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల ఉచిత విద్యుత్‌ : సీఎం కిరణ్‌
మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి): 2004 ముందు రైతులకు రుణాలు రావాలంటే గగనంగా ఉండేదని, సోనియా గాందీ, మన్మోహన్‌సింగ్‌ పుణ్యం వల్లే ఆనాడు 65వేల కోట్లు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కోటి మంది రైతులకు ఆన్‌లైన్‌లో పంటరుణాలపై వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పాలమూరు జిల్లా జడ్చర్లలో రైతు చైతన్య యాత్రలను సిఎం ప్రారంభించారు. రైతుల ను వడ్డీకట్టమని అడుగుతున్నట్లు తెలిసిం దని, ఒక్క రూపాయి కూడా చెల్లిం చాల్సి నవసరం లేదన్నారు. 72వేలకోట్ల రూపా యలను రైతలకు రుణాలిస్తున్నా మన్నారు. 58వేలకోట్లు పంటరుణాలున్నా యన్నారు. 75లక్షలకోట్లు         రుణాలను దేశవ్యాప్తంగా ఇస్తే యుపిఎ 7లక్షల కోట్ల రుణాలను నేడు ఇస్తుందన్నారు. పంటలు ఏవిధంగా వేసుకోవాలో, డైరీ, హార్టికల్చర్‌ అందరు అధికారులు గ్రామాల్లోకి వచ్చి సలహాలు, సూచనలిస్తారని,దీనిని వినియోగించుకోవాలని కోరారు. రైతుచైతన్య యాత్రలతోపాటు, చైతన్య సదస్సులు కూడా నిర్వహిస్తామన్నారు. డివిజన్‌ స్థాయిలో ఇవి నిర్వహిస్తామన్నారు. ఇన్‌పుట్‌ సబ్సీడిని ఖరీఫ్‌ ప్రారంబం కాకముందే 2వేల కోట్ల రూపాయలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తాను సిఎం కాక ముందు నాలుగువేలు ఉండే పరిహారం నీలం తుఫాన్‌ తర్వాత 6వేలకు పెంచామని, ఇటీవలే పదివేలు చేశామని, వీటిని 15వేలకు పెంచుతున్నామన్నారు. రుణాలిస్తూనే ఫాంమెకనైజేషన్‌కోసం 20, 30శాతం సబ్సీడిపై రుణాలిస్తున్నామన్నారు. విత్తనాలు తదితర అవసరాలపై సబ్సీడి పెంచి ఇస్తున్నామన్నారు. వందల ఏళ్లుగా ఎస్సీలు, అట్టడుగునే ఉంటూ దినదినం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నందునే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ పథకాన్ని తీసుకురావడం జరిగిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.  ఇందిరమ్మ కలలు పేరుతో నాలుగు కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఓవైపు గృహనిర్మాణం యూనిట్‌ధరలను పెంచడం, మరోటి ఉచిత విద్యుత్‌ ఇవ్వడం, మరోటి విద్యార్థులను బయటి దేశాలకు పంపించేందుకు పదిలక్షలుగ్రాంట్‌, మరో అయిదు లక్షలు రుణం ఇప్పించే కార్యక్రమం ఉందన్నారు. రెండవేల మంది ఐఐటిల్‌/రిళి, ఐఐఎంలలో చదువుతున్న వారికి డబ్బులుప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఇందిరజల ప్రభ కార్యక్రమం క్రింద ఎకరా యూనిట్‌ డబ్బును అయిదులక్షలకు పెంచామన్నారు. మౌళిక సదుపాయాలకోసం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రక్షితనీటి కోసం నాలుగు వందలకోట్ల రూపాయలు వెచ్చిస్తామన్నారు. పదోతరగతి తర్వాత చదువుకునేందుకు హాస్టళ్లు ఎస్సీలకు అయిదు మాత్రమే ఉన్నాయని, ఎస్టీలకు 22 మాత్రమే ఉన్నాయని గుర్తించామన్నారు. దీనివల్ల డ్రాపవుట్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని 100 హాస్టళ్లు నిర్మిస్తామన్నారు. ఒక్కోటి రెండుకోట్లతో నిర్మిస్తామన్నారు. ఒక్క సంవత్సరంలోనే పూర్తిచేస్తామన్నారు. ఎస్టీలకు 250 హాస్టల్స్‌ను 250కోట్లతో నిర్మిస్తామన్నారు. ఇందులో 70వేల మందికి అదనంగా విద్యార్జనకు అవకాశం కల్పిస్తామన్నారు. ఆడపిల్లలకు కూడా ఎక్కువగా హాస్టల్స్‌ ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 25ఏళ్లలోపు యువకులు రాష్ట్రంలో 54శాతం మంది ఉన్నారని, వారికి సరైన మార్గం చూపించక పోతే అనర్థాలు జరిగే
అవకాశాలున్నాయని గుర్తించడం జరిగిందన్నారు. ఇప్పటికే లక్షా 23వేల ఉద్యోగాలు నియమించామన్నారు. 82వేలకొత్త ఉద్యోగాలు సృష్టించామన్నారు. గత 30ఏళ్లలో కొత్తవి సృష్టించకపోగా ఉన్నవి నింపలేదన్నారు. అలాగే రాజీవ్‌ యువ కిరణాల పేరుతో యువతకు ప్రైవేట్‌ ఉద్యోగాలను కల్పిస్తున్నామన్నారు. నేషనల్‌ ఫైనాన్స్‌ డెవలప్‌ మెంట్‌ సంస్థను, సఫాయి కర్మచార్‌ సంస్థలను పునరుద్దరిస్తున్నామన్నారు. స్వయం ఉపాధికోసం ఎస్సీఎస్టీ యువతకు 2లక్షల60వేల మందికి  ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం 1150కోట్లు వెచ్చిస్తామన్నారు. ఇది మొత్తం సబ్సీడి కోసమేనన్నారు. బ్యాంకర్లతో నిర్ణయించి రుణం ఇప్పిస్తామన్నారు. విదేశాలకు వెళ్లేందుకు పరీక్షలు రాసేందుకు గాను అయిదువేల మందికి శిక్షణ నిస్తామన్నారు. అయిదువందలమంది విదేశాలకు వెల్లేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈసందర్బంగా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చిన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు.   ఈసంవత్సరం ఎస్సీలకు 8585 కోట్ల రూపాయలను, ఎస్టీలకు 3666 కోట్ల రూపాయలను వారి వారి జనాభా ప్రకారం కేటాయించడం జరిగిందని, వీటిని సక్రమంగా అందేలా చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రక్కదారి పట్టే అవకాశాలు లేనే లేవన్నారు. ఒక వేళ కేటాయించిన మొత్తం ఖర్చు చేయకపోతే వచ్చే సంవత్సరంలో వాటిని కలుపుకుని వెచ్చించాల్సిందేనన్నారు. అధికారంలో ఏపార్టీ ఉన్నా కూడా ఈపనిని చేపట్టి తీరాల్సిం దేనన్నారు. విద్యావంతులైన యువకులు ముందుకు వచ్చి నిరక్షరాస్యులను చైతన్యం చేయాలని సిఎం పిలు పునిచ్చారు.  భారతదేశంలో ఎక్కడా లేనివిదంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వెచ్చిస్తున్న నిధులకు చట్టబద్దతకల్పిస్తూ సబ్‌ప్లాన్‌ను తీసుకురావడం జరిగిందని కిరణ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఏప్రభుత్వం కూడా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్‌ను అమలు చేసిన పాపాన పోలేదని, అయితే ఈచట్టం వల్ల తప్పకుండా వెచ్చించాల్సి ఉంటుందన్నారు. విద్యుత్‌ ఒక్కోయూనిట్‌కు యాభైయూనిట్లలోపు వారికి రూపా యి45పైసలే వసూలు చేస్తున్నామన్నారు. దీనిపై 3.80 రూపాయలను ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అయిదు రూపాయల ఇరవై ఐదు పైసలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. జిల్లాలో బోర్ల్‌ వేసేందుకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అయిదుకోట్ల రూపాయలు బోర్లు, మోటార్లకోసం మంజూరు చేస్తున్నామన్నారు. జూరాల క్రింద రైతులకోసం కర్నాటక తో మాట్లాడి నీళ్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. రెండు మూడు టిఎంసిల నీటికోసం ప్రయత్నిస్తానన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వేను త్వరగా చేయాలని ఆదేశాలు జారీచేశారు. చదువులో ప్యాకేజి ఇవ్వాల్సినవసరం ఉందని, దీనిని పూర్తి చేస్తామన్నారు.కార్యక్రమంలో మంత్రి డికె అరుణ, కన్నా లక్ష్మినారాయణ ,మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.