వానాకాలం సి.ఎం.ఆర్.రైస్ ను త్వరితగతిన అందివ్వాలి…

– అదనపు కలెక్టర్ భాస్కర రావు….
జనగామ కలెక్టరేట్ జూలై  (జనం సాక్షి):
వానాకాలం 2021-22 సంత్సరముకు సంబంధించి సి.ఎం.ఆర్. రైస్ ను త్వరితగతిన అందివ్వాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మిల్లర్లను కోరారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సి.ఎం.ఆర్.రైస్ పై జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2021-22 వానాకాలముకు సంబంధించిన 1,38,877.800 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 67 శాతంతో 93.048.126 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని రైస్ మిల్లర్లకు అందజేయడం జరిగిందని ఇప్పటి వరకు 50 శాతంతో 46.501.885 మెట్రిక్ టన్నుల సి.ఎం.ఆర్. ధాన్యం అందించడం జరిగిందన్నారు. మిగిలిన 50 శాతం 46,546.241 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన అందజేయాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని రోజారాణి,సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సంధ్యారాణి, సివిల్ సప్లై డీటీలు, ఏ.యం. టెక్నికల్, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు బి సతీష్ తదితరులు పాల్గొన్నారు.