వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంధ్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 20(జనంసాక్షి):
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా రంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్ పిలుపు లో బాగంగా
నాగర్ కర్నూల్ జిల్లా లో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం విద్యాసంస్థల బంధు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం. తారా సింగ్ మాట్లాడుతూ విద్యార్థి వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానం-2020 రద్దు చేయాలనీ,విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ లు అందించాలనీ,ప్రభుత్వ విద్యా సంస్థల్లో పాఠ్యపుస్తకాలు,యూనిఫాం అందించాలి మరియు మౌళిక సదుపాయాలు కల్పించాలనీ,మన ఊరు-మన బడి పథకంలో అన్ని ప్రభుత్వ బడులను చేర్చి తక్షణమే సరిపడా నిధులు విడుదల చేయాలనీ,ఖాళీగా ఉన్న టీచర్,ఎంఈవో,డీఈవో పోస్టులను భర్తీ చేయాలనీ,పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన మెనూ చార్జీలు పెంచి, నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలనీ, ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విద్యార్థులు లేరనే సాకుతో పాఠశాలల మూసివేతను విరమించుకోవాలనీ,ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, జిల్లాలో ఇంటర్మీడియట్ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికన ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టాలి,గెస్ట్ లెక్చరర్ పోస్టులు రెన్యూవల్ చేపట్టాలనీ,రాష్ట్ర వ్యాప్తంగా 4వేల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనీ,జిల్లాలో వేలాది మంది బీసీ విద్యార్థులకు రెండు సంవత్సరాలుగా రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదనీ,తక్షణమే వారిని బకాయిలను చెల్లించి చదువులు కొనసాగేలాచూడాలన్నారు.విద్యార్ థులు, ఉపాధ్యాయులు తరగతులు బహిష్కరించి స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారని,దీనికి ప్రభుత్వ,ప్రైవేటు విద్యాసంస్థలు సహకరించారు,రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మరియు ఇంటర్మీడియట్ కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజాసంఘాలు,ఉపాధ్యాయ సంఘాలు.ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కార్తీక్,జిల్లా సహా కార్యదర్శి గణేష్,ఎస్ఎఫ్ఐ నాయకులు రవి,భాను,శివ,కార్తీక్,పులి తదితరులు పాల్గొన్నారు.