వాస్తవదూరంగా బడ్జెట్
` ఆదాయం చూపకుండా కేటాయింపులు
` ఎక్సైజ్ ఆదాయం గతం కన్నా మిన్నగా చూపారు
` బడ్జెట్‌పై హరీశ్ రావు విమర్శలు
హైదరాబాద్(జనంసాక్షి):మల్లు భట్టివిక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఆదాయాం చూపకుండా కేటాయింపులు చేశారు.ఎక్సైజ్ ఆదాయం గతం కన్నా మిన్నగా చూపారు. అభూత కల్పనలతో మసిపూసి మారేడుగాయ చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు. రూ.4.5 లక్షలు లేని జీఎస్‌డీపీని రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై సాధారణ చర్చను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. పదేండ్ల పాలనలో ఉన్న సమాచారాన్ని తొలగించారు. కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ, ప్రజల మెదడు నుంచి తొలగించలేరని పేర్కొన్నారు. అక్షరాలను తొలగిస్తారేమో కానీ, అనుభవాల్ని తొలగించలేరన్నారు. బీఆర్‌ఎస్ శ్రమను, కాంగ్రెస్ ఎనిమిది నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం అవాస్తవాలతో నిండి ఉంది. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. పన్నేతర ఆదాయంలో రూ.35 వేల కోట్లు వస్తుందని చూపించారు. ఎలా వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. విధానాల రూపకల్పన కంటే బీఆర్‌ఎస్‌ను తిట్టడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారన్నారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇప్పుడు రూ.10 వేల కోట్ల విలువ చేసే భూములు అమ్మి నిధులు సవిూకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విూ మాటపై గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సాధ్యంకాని తరహాలో ఆదాయం ఎక్కువ చూపించారని, తప్పనిసరి ఖర్చులను తక్కువ చేసి చూపించారన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. బడ్జెట్లో రూ.26 వేల కోట్లు మాత్రమే వస్తున్నది. ఆలస్యం అయిందని రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆలస్యం చేసి వడ్డీ భారాన్ని రైతులపై మోపుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 వందల పింఛన్ ఇస్తే బీఆర్‌ఎస్ పాలనలో రూ.2వేలకు పెంచామని తెలిపారు. అధికారంలోకి రాకముందు రూ.4 వేలు పింఛన్ ఇస్తామన్నారు. ఆ 4 వేల పింఛన్ ఇంకా నాలుక విూదనే ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలతో నిండి ఉంది. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. విధానాల రూపకల్పన కంటే మమ్మల్ని తిట్టడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రూ.35 వేల కోట్లు వస్తుందని బ్జడెట్‌లో చూపారు. తప్పనిసరి ఖర్చులను తక్కువ చేసి చూపారు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. బ్జడెట్‌లో రూ.26 వేల కోట్లు మాత్రమే వస్తోంది. ఆలస్యం అయిందని వడ్డీ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆలస్యం చేసి వడ్డీ భారాన్ని రైతులపై మోపుతోందని హరీశ్‌రావు విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని హరీశ్ రావు అన్నారు. గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనలేదా అని ప్రశ్నించారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బస్సులు లేని 15 వందల గ్రామాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహాలక్ష్మీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణలో 90 శాతం దొడ్డు వడ్లు పండిస్తారని, దొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలన్నారు. గృహజ్యోతి పథకంలో ఇబ్బందులున్నాయని, యువ వికాసం పథకంపై బ్జడెట్‌లో అసలు చర్చే లేదన్నారు. చేయూత గురించి ప్రభుత్వం మాటైనా మాట్లాడటం లేదని విమర్శించారు.