వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీమెగా వైద్య శిబిరం
బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి) ఈనెల 29న జనగామ జిల్లాలోని ఓబుల్ కేశపూర్ గ్రామంలో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ నిడిగుండ నరేష్ కుమార్ తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్. జి. శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించడం జరిగింది అన్నారు. అనంతరం వాస్విక్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న వైద్య అవగాహన సదస్సుల గురించి హెల్త్ క్యాంపు ల గురించి రక్తదాన శిబిరాల గురించి డాక్టర్ గారితో చర్చించడం జరిగిందన్నారు. ఓబుల్ కేశపురంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత మల్టీ మెగా వైద్య శిబిరానికి రావలసిందిగా డాక్టర్ను కోరడం జరిగిందని తెలిపారు. డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవలు బాగున్నాయని మా సంస్థల మైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమాలను చేయవలసిందిగా కోరారు. మీరు చేసే సేవా కార్యక్రమాలకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు