వాహనాల తనిఖీ ముమ్మరం
విజయనగరం, జూలై 20: పట్టణ శివారులోని రాయగడ రోడ్డు వద్ద మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రమేష్ శుక్రవారం నాడు వాహనాలు తనిఖీ చేశారు. అనుమతులు లేని వాహనాలపై జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు ఆటోలు, రెండు లారీలను సీజ్ చేశామన్నారు. స్కూల్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని, ఇప్పటి వరకు 12 వాహనాలు తనిఖీ చేశామని తెలిపారు. ఈ బస్సుల్లో అత్యవసర డోర్, హ్యాండ్ బ్రేక్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అనుమతులు లేని బస్సులు తిప్పితే చర్యలు తప్పవని హెచ్చరించారు.