విఆర్ఏలు చేస్తున్న నిరాహారదీక్ష కు బిజెపి పార్టీ మద్దతు.
గద్వాల నడిగడ్డ, జులై 22 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ దగ్గర శుక్రవారం వీఆర్‌ఏలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డికె. అరుణమ్మ అదేను సారం కలక్టరేట్ దగ్గర మద్దతు తెలిపి నిరాహారదీక్ష లో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేస్కేల్ ఇస్తామని, అర్హతగల వీఆర్‌ఏ లకు పదోన్నతులు కల్పిస్తామని, 55సంవత్స రాల పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యో గాలు కల్పిస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారన్నారు. హామీలను జీవో రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ లో కేసీఆర్ కుటుంబం బాగుపడిందే తప్ప ఏ ఒక్క కుటుంబం బాగుపడలేదన్నారు.
తెలంగాణలో ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండనీ,పుట్టిన ప్రతి బిడ్డ పైన 1,25,000 రూపాయల అప్పు ఉందనీ,
తెలంగాణ ఉద్యమంలో 14వందల మంది అమరులైతే, కెసిఆర్ ,కేసీఆర్ కుటుంబానికి చిటికెన వేలు దెబ్బ కూడా తగలలేదనీ,కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లు దోచుకున్నాడనీ,
పాలమూరు రంగారెడ్డి తుమ్మిళ్ల బీమా ప్రాజెక్టులు నాలుగైదు వేల కోట్లు ఖర్చు చేస్తే 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి ఎక్బోటే, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మీర్జాపురం వెంకటేశ్వర రెడ్డి,రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు బలరాం,రాష్ట్ర బిజెవైఎం కార్యవర్గ సభ్యుడు తిరుమల్, జిల్లా మహిళ మోర్చా ఉపాధ్యక్షురాలు భారతి, బిజెవైఎం నాయకులు గోసాయి హరి, నిలపు ఈశ్వర్, శ్రీనివాస్ ,జిల్లా ఎస్సి మోర్చా ప్రధాన కార్యదర్శి కిరణ్, పట్టణ ప్రదాన కార్యదర్శి పాండు తదితరులు ఉన్నారు.