వికలాంగులకు ఉచిత ఫిజియో థెరపి సేవలు
కందుకూరు ,జూలై 24,: స్థానిక డిఆర్‌సి భవన్‌లో వికలాంగుల విద్యార్థులకు ఎంఇఓ ఎంఎస్ రాంబాబు ఆధ్వర్యంలో ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ యువరాణి ఆధ్వర్యంలో సోమవారం ఉచితంగా సేవలు అందించబడ్డాయి. ఈ సందర్భంగా యువరాణి 13 మంది వికలాంగ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిలు భాస్కర్, ఐఇడి ఎంఆర్‌పి కోటయ్య, వికలాంగ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.