వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా జాతీయ కౌన్సిల్ సభ్యులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్6(జనంసాక్షి):

వికలాంగులు హక్కుల జాతీయ వేదిక ఇండియా జాతీయ కౌన్సిల్ సభ్యులుగా నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరి సభ్యులకు అవకాశం కల్పించడంపై జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు జాతీయ కౌన్సిల్ సభ్యులుగా జిల్లా నుండి ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పించినందుకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా వ్యవస్థాపకులు తుడుం రాజేందర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన వారు జిల్లా వికలాంగుల సమస్యల పరిష్కారం కొరకు వేగవంతంగా పనిచేసి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పరస్పరం సహకరించుకుంటూ వికలాంగులకు సంక్షేమం కోసం తోడ్పడుతూ ప్రభుత్వ పథకాలు అందించడంలో భాగస్వాములు కావాలన్నారు అలాగే జిల్లాలో మన సంఘం బలోపేతానికి కూడ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రఘునందన్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సైదమ్మ, ఎస్సీ కమ్యూనిటీ జిల్లా అధ్యక్షులు. రామ్మోహన్ ఉపాధ్యక్షురాలు స్రవంతి, రాష్ట్ర మాతృమూర్తి అవార్డు గ్రహీత కొల్లాపూర్ డివిజనల్ ప్రధాన కార్యదర్శి నారాయణమ్మ నిర్మల. బాలేశ్వర అయ్యా విజయ్ అంజి జోగిరామ్ జంగయ్య రాజు వికలాంగులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు