విజయవంతం అయిన ఎల్ఐసి ఏజెంట్ల రెస్ట్ డే.
లావాదేవీలు జరగని ఎల్ఐసి కార్యాలయం.
ఎల్ఐసి పాలసీ దారులకు బోనస్ పెంచాలి.
రుణాలపై వడ్డీ శాతాన్ని తగ్గించాలి.
ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలి. ఏజెంట్లకు కమిషన్లు యధావిధిగా కొనసాగించాలి.
ఏజెంట్ల అసోసియేషన్ హైదరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్5(జనంసాక్షి): ఎల్ఐసి పాలసీ దారులకు న్యాయం చేకూరుస్తూ ఏజెంట్లు హక్కులను కాపాడాలని ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ దేశ వ్యాప్త పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి శాటిలైట్ కార్యాలయం ముందు గత ఐదు రోజులుగా ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు సుఖ జీవన్ రెడ్డి అధ్యక్షతన చేపట్టిన ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి.అందులో భాగంగానే సోమవారం ఎల్ఐసి ఏజెంట్ల రెస్ట్ డే విజయవంతం అయ్యోంది.ఎల్ఐసీ కార్యాలయం లో ఒక్క లావాదేవీ కూడా జరగలేదు.ఈ కార్యక్రమానికి లియాపీ యూనియన్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందౄ అయిన మాట్లాడుతూ ఎల్ఐసి పాలసీ దారులకు వెంటనే బోనస్ ను పెంచాలని డిమాండ్ చేశారు.పలు డిమాండ్లతో కూడిన అంశాలపై యూనియన్ పోరాటం చేస్తుందని ఏజెంట్ మిత్రులంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.పాలసీదారులు తీసుకుంటున్న రుణాలకు వడ్డీ శాతాన్ని తక్షణమే తగ్గి చాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ ని ఎల్ఐసి పాలసీ లపై ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత 66 ఏళ్లుగా ఎల్ఐసి సంస్థకు ఏజెంట్లు వెన్నుముకగా పని చేస్తున్నారని, ఏజెంట్లకు వచ్చే కమిషన్ పై ఎలాంటి ఆంక్షలు విధించకుండా యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ప్రమాదవశాత్తు ఎల్ ఐ సి ఏజెంట్ లకు ప్రమాదం సంభవించినట్లయితే ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి ఏజెంట్ల పిల్లలకు విద్య కోసం రుణాలు అందించాలని వారు పేర్కొన్నారు.
ఎల్ఐసి పాలసీ బాండ్లను ఎల్ఐసి కార్యాలయంలోనే నేరుగా ఏజెంట్లకు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఐదేళ్లు నిండిన పాలసీలకు ఎల్ఐసి కార్యాలయం లోనే రెన్యువల్ చేయాలని పేర్కొన్నారు.ఎల్ఐసి ఏజెంట్లు అంతా దేశవ్యాప్తంగా చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని కలసికట్టుగా చేసినట్లయితే సమస్యలను సాధించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో శాటిలైట్ బ్రాంచ్ లియాఫీ అధ్యక్షులు సుఖ జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, కోశాధికారి బి శ్రీనివాసులు,వనపర్తి బ్రాంచ్ యూనియన్ నాయకులు మన్యం,లియాఫీ నాగర్ కర్నూల్ డివిజన్ మాజీ అధ్యక్షుడు బాల్ రెడ్డి, మాజీ కోశాధికారి సుధాకర్ రావు, ఏజెంట్లు, బాదం శ్రీనివాసులు,పాపులు, పసుపుల లక్ష్మయ్య,వెంకటయ్య గౌడ్, ఎండీ.శాలినియా, సురేందర్ గౌడ్,ఎండి సాజిద్, రాములు,రాజేంద్ర ప్రసాద్, హనుమంత్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి, ఆంజనేయులు, చాంద్ పాషా, మల్లేశ్వర్,సందు యాదగిరి తదితరులు పాల్గొన్నారు