విజయవంతమైన భారీ బహిరంగ సభ

వనపర్తి నియోజకవర్గం లో మళ్లీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిదే గెలుపు

ఒకే రోజులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు

అధిక సంఖ్యలో తరలివచ్చిన జనవాహిని

ప్రజల కు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా భారాస అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్

వనపర్తి బ్యూరో సెప్టెంబర్30 (జనంసాక్షి)

వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభ కు తరలివచ్చిన రైతులకు మహిళలకు, విద్యార్థులకు, యువకులకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి బిఅరెస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.కేటీఆర్
సభ విజయవంతమైన సందర్భంగా వాకిటి
మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం తెలంగాణలోనే ఒక ఐకాన్ గా నిలపడానికి కృషి చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి నియోజకవర్గ చరిత్రలో ఏకకాలంలో మొదటిసారి వనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 700 కోట్లతో ఒకే రోజు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేయడంతో వనపర్తి దశ దిశ మారుతుంది అన్నారు . రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంత్రిగా ఉండడం వనపర్తి నియోజకవర్గం ప్రజల అదృష్టంగా భావించాలని అన్నారు.ఆయిల్ పామ్ ,మిషన్ భగీరథ, తాగునీటి పథకం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
రాజుపేట 4 బ్లాకులు 96 అళ్లు ప్రారంభోత్సవం,
ఉర్దూ ఘర్ పాదీవాన ప్రారంభోత్సవం,
ప్రొ. జయశంకర్ గార్డెన్ ప్రారంభోత్సవం,
డైనింగ్ హాల్ అనుబంధ భవనం టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రారంభోత్సవం,
భూసార పరీక్షల ప్రయోగశాల ప్రారంభోత్సవం రైతు వేదిక పక్కన నాగవరం,
బిఎస్సీ అగ్రికల్చర్ కళాశాలకు శంఖుస్థాపన,
నాగవరం దగ్గర సిగ్రేషన్ షెడ్ ప్రారంబోత్సవం,
మున్సిపాలిటీ పరిధిలో అధునాతన దహన వాటిక ప్రారంబోత్సవం జంతు సంరక్షణ యూనిట్ ప్రారంభోత్సవం.కెడి ఆర్ పాలిటెక్నిక్ కళాశాల రాజప్రసాదం పునర్నిర్మాణం పనులకు శంకుస్థాపన, పాలిటెక్నిక్, బాలుర, బాలికల వసతి గృహాలకు శంకు స్థాపన,
వనపర్తి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, డ్రైన్స్ కు శంకుస్థాపన సురవరం ప్రతాప రెడ్డి జిల్లా గ్రంథాలయం రాజీవ్ చౌక్ ప్రారంబోత్సవం, నూతనంగా నిర్మించిన సురవరం సాహితి కళా దేదిక ప్రారంభోత్సవం.నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం ప్రారంభోత్సవం ,పెబ్బేర్ రోడ్ కు రోడ్ బైపాస్ రోడ్ వనపర్తి శంఖుస్థాపన,పీర్లగుళ్లు రెండు గదుల ఇళ్ల ప్లాంభోత్సవం (296 ఇళ్లు),ప్రభుత్వ జూనియర్ కళాశాల ,బాలుడు, బాలికల కొరకై జేఎన్టీయూ హాస్టల్ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ బీఅర్ఎస్ పార్టీవి స్కీములు
కాంగ్రెస్ వి స్కాములు,
కాంగ్రెస్ అంటే కన్నీళ్లు
బీఅర్ఎస్ అంటే సాగునీళ్లు,
కాంగ్రెస్ అంటే మైగ్రేషన్
బీఅర్ఎస్ అంటే ఇరిగేషన్,
కాంగ్రెస్ పార్టీవీ వారంటీ లేని గ్యారంటీలు,కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉన్నది,
కాంగ్రెస్ ను నమ్ముకుంటే 24 గంటల కరంటు పోయి 3 గంటల కరంటు ఖాయం,
నల్లా నీళ్లు బందయి నీళ్ల కోసం ఎదురుచూడాలి.పాలమూరుకు వస్తున్న మోడీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వాలి.
కృష్ణా నీటిలో తెలంగాణ వాటా 575 టీఎంసీల కేటాయించాలి.
తెలంగాణ అంటే మోడీకి ఎందుకు కక్ష్య.వాల్మీకీ బోయలకు ఎస్టీ హోదా కోసం రెండుసార్లు తీర్మానం పంపినా పట్టించుకోలేదు.రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ కు అధికారం ఇవ్వాలి.కేంద్రంలో మన ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడొద్దు.గులాబీ జెండా ఎగిరేసే వరకు పాలమూరును పట్టించుకోలేదు.జిల్లాను దత్తత తీసుకున్నోళ్లు కూడా దగా చేశారు.జిల్లా నుండి 14 లక్షల మంది వలసపోతుంటే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు.
నది పక్కన నేలలున్నా ఏ ప్రభుత్వం కూడా నీళ్లివ్వలేదు.
ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీళ్లు తీసుకుపోతున్నా పట్టించుకోలేదు.అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే హారతులిచ్చి పంపించింది దగుల్బాజీ కాంగ్రెస్ నేతలు.
నాడు మనిషి చనిపోతే స్నానాలు చేయడానికి నీళ్లు లేని పరిస్థితి.రైతులను ఆదుకుని రైతుబంధుతో అండగా నిలిచింది కేసీఆరే ప్రభుత్వం.ఇంటింటికి నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ ది.పోయించి ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష 116 ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది.రైతుభీమా పథకం కింద వనపర్తి జిల్లాలో 1400 మంది రైతులకు రూ.5 లక్షల సాయం అందించారు .
11 సార్లు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ సమస్యల గురించి మాట్లాడడం హంతకులు సానుభూతి చెప్పినట్లుంది.వస్తదో రాదో తెలియని తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర మాది.
పదవుల కోసం కాదు ప్రాంతం సమస్యలు తీరాలని కొట్లాడారు.మంత్రి పదవి ఆశించి వారు ఉద్యమం చేయలేదు.వనపర్తికి లక్ష 25 వేల ఎకరాలకు నీళ్లొచ్చాయంటే అది నిరంజన్ రెడ్డి ఘనత, కేసీఆర్ ఆశీస్సుల వల్లే సాధ్యం అయింది.డిగ్రీ కళాశాల కోసం ధర్నాలు చేసిన స్థితి నుండి వనపర్తికి మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చాయని గర్వంగా గల్లా ఎగరేసి చెప్పొచ్చు.180 కోట్లతో నూతన ఆసుపత్రిని నిర్మించారు.వనపర్తిని జిల్లా చేసి కలెక్టరేట్ నిర్మించారు.
పీర్ల గుట్ట డబల్ బెడ్రూం ఇండ్లు బంజారాహిల్స్ లా ఉన్నాయి.
3280 డబల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు.ఐటీఐ, కేజీబీవీ, వ్యవసాయ డిగ్రీ కళాశాలల నిర్మాణం.ఇంటి పెద్దలా నిరంజన్ రెడ్డి వనపర్తిని అభివృద్ది చేస్తున్నారు.
65 ఏళ్లలో చేయని పనిని ఐదేళ్లలో చేసి చూయించారు.
కేసీఆర్ కుడిభుజంగా తెలంగాణ జెండా ఎత్తి గ్రామగ్రామాన తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు అభివృద్దికి నిరంతరం కృషిచేస్తున్నారు.
సిరిసిల్ల, సిద్దిపేట మాదిరిగా అత్యధిక మెజారిటీతో నిరంజన్ రెడ్డి మళ్లీ గెలిపించాలి.వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో మంత్రులు కేటీఅర్ పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, వీఎం అబ్రహం , ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి , కార్పోరేషన్ చైర్మన్లు , జడ్పీ చైర్మన్ తదితరులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీళ్లు,రూ.22 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణం,సిరిసిల్ల, సిద్దిపేటతో పోటీపడి వనపర్తిని అభివృద్ది చేస్తాను.మీరిచ్చిన విజయానికి కృతజ్ఞతగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేశాను.వనపర్తి బహిరంగసభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను . ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వనపర్తిలో అనూహ్యమైన అభివృద్ది .
ఐటీ టవర్ నిర్మాణానికి జీఓ విడుదల చేసిన కేటీఆర్ కు ధన్యవాదాలు.75 వేల ఎకరాలకు నీళ్లిచ్చిన తర్వాతనే నామినేషన్ వేస్తానని మాటిచ్చి నిలబెట్టుకుని నామినేషన్ వేశాను.ఇప్పుడు లక్ష 25 వేల ఎకరాలకు సాగునీళ్లు తీసుకువచ్చాను.ప్రభుత్వ సహకారంతో అనేక విద్యాసంస్థలు తీసుకువచ్చాను. వచ్చే ఎలక్షన్లో నిరంజన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీ ఆశీస్సులతో నియోజకవర్గాని మరింత అభివృద్ది చేస్తారు అని బిఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు.