విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా..

గౌతం సవాంగ్‌ బాధ్యతల స్వీకరణ
విజయవాడ, జులై11(జ‌నం సాక్షి) : రాష్ట్ర ప్రధాన పరిపాలన, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా గౌతం సవాంగ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆర్టీసీ బస్‌భవన్‌లోని విజిలెన్స్‌ విభాగం ప్రధాన కార్యాలయంలో ఇప్పటివరకు ఆ విభాగం ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తోన్న ¬ంశాఖ కార్యదర్శి అనురాధ నుంచి ఈ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం విజిలెన్స్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. తాను మొదటిసారిగా విజిలెన్స్‌ విభాగ బాధ్యతలు చూస్తున్నానని.. సాధ్యమైనంత త్వరగా ఇక్కడి కార్యకలాపాలపై అవగాహన పెంచుకుని ప్రజల సహకారంతో మెరుగైన పనితీరు కనబరుస్తానని సవాంగ్‌ అన్నారు. మూడేళ్లు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. తన పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు- ప్రభుత్వ సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేశామని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం విజిలెన్స్‌ విభాగానికి పూర్తిస్థాయి డీజీ నియామకం ఇదేనని వెల్లడించారు. ఈ విభాగంలో కొన్ని కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వీటిపై సవిూక్షించి ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామన్నారు.