విజేత కళాశాల ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా
ఈనెల 11న అపోలో ఫార్మసీ, అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో….
ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ
మిర్యాలగూడ,జనం సాక్షి
విజేత డిగ్రీ మరియు పీజీ కళాశాలల ఆధ్వర్యంలో మరో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ తెలిపారు. సోమవారం సాయంత్రం విలేఖరితో మాట్లాడుతూ జాబ్ మేళాలను నిర్వహించడంలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని, అటు ఉద్యోగాలను ఇచ్చే సంస్థలకు ఇటు జాబ్ మేళాలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులకు కూడా తమ ఏర్పాట్ల పట్ల నమ్మకం ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ నెల 11వ తేదీన అపోలో ఫార్మసీ, అపోలో హాస్పిటల్ ల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.మిర్యాలగూడ, హైదరాబాద్ కేంద్రాల్లో ఉద్యోగ నిర్వహణ నిర్వహించే విధంగా పదో తరగతి ఉత్తీర్ణత నుండి ఇంటర్, డిగ్రీ, డి ఫార్మసీ, బీ ఫార్మసీ.ఏం ఫార్మసీ, పి సి ఐ సర్టిఫికెట్ ఉన్నా లేకున్నా అర్హతలుగా పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్ స్టోర్స్ లో అనుభవం ఉన్న వారికి కూడా కల్పిస్తున్నారని ప్రిన్సిపల్ వివరించారు. కేవలం యువకులకు మాత్రమే నిర్వహించే జాబ్ మేళా ఈనెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడుతుందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు