విజేత డిగ్రీ, పీజీ కళాశాల లో హేటిరో డ్రగ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
స్థానిక విజేత డిగ్రీ అండ్ పీజీ కళాశాల లో హేటిరో డ్రగ్స్ లిమిటెడ్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 9 వ తేదీ న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనంజయ తెలిపారు.శుక్రవారం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ జీవితంలో అనేక అవకాశాలు వస్తాయి కానీ, మంచి అవకాశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తాయని వాటిని సద్వినియోగం చేసుకుంటేనే విజేతగా నిలుస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ఎన్నో జాబ్ మేళా నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ కళాశాలదని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉద్యోగ అవకాశాలు గల హేటిరో డ్రగ్స్ లో ,బి ఎస్సీ,ఎం ఫార్మసీ,ఎం ఎస్సీ,బి. టెక్,ఐ టి ఐ,డిప్లొమా మెకానికల్,ఎం, ఎస్సి. కెమిస్ట్రీ 2021,2022 – 23 బ్యాచ్ ల లో ఉత్తిర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు.డిగ్రీ మరియు పి జి విద్యార్హత గలవారికి ఆన్ లైన్ లో పరీక్ష ఉంటుందని,ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్ తెచ్చుకోవాలని సూచించారు. తమ విజేత కళాశాల ప్రాంగణంలో నిర్వహించే జాబ్ మేళా లో పాల్గొనే యువతీ యువకుల విద్యార్హత 27 సంవత్సరాల లోపు ఉండాలని, పాస్ ఫోటో మరియు బయోడేటా, ఆధార్ కార్డు జిరాక్స్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్లు, ఆండ్రాయిడ్ ఫోన్లతో 9వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి హాజరు కావాలని ఆయన కోరారు.