వితంతువులకు సమానహక్కు కల్పించాలి
వరంగల్,(జనంసాక్షి): అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో వితంతువులు భారీ ర్యాలీని నిర్వహించారు. వితంతువుల సమానతకై పోరాడుదామంటూ కలెక్టరేట్ నుంచి బాల వికాస ఆధ్వర్యంలో ఖాజీపేట వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని టీడీపీ ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. వితంతువులకు సమాజంలో సమానహక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. వితంతువులపై వివక్షత తగ్గాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.