విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్ యు ఆధ్వర్యంలో బంద్ విజయవంతం

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 20 : జిల్లా కేంద్రంతో పాటు ధరూర్ మండలంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలు,జూనియర్ కళాశాలల బంద్ ని విజయవంతం చేశారు వామపక్ష విద్యార్థిసంఘ నేతలు .

ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు వంశీ కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి మురళీ మాట్లాడుతూ..

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పులుపులో భాగంగా గద్వాల జిల్లా లో బంద్ విజయవంతం అయ్యిందని .నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ-2020) రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పాఠ్యపుస్తకాలను అందించాలని విద్యార్థులందరికీ సకాలంలో యూనిఫామ్స్ ఇవ్వాలన్నారు.మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి,పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ,ఎంఈవో, డిప్యూటీఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరారు.ప్రయివేటు,కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులను అరికట్టాలనీ,నియంత్రించేందుకు చట్టం తేవాలని పేర్కొన్నారు.జూనియర్‌ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని,వాటిలో మౌలిక వసతులు మెరుగుపర్చి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని,వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌కు ప్రవేట్ పాఠశాలలు,మరియు జూనియర్ కళాశాలల యాజమాన్యం వారు సంపూర్ణ మద్దతు ప్రకటించి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ బంద్ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా కమిటీ సభ్యులు మన్యం,శివ కుమార్,రాజు కుమార్,మనోహర్,వెంకటేష్,రవి,కోళ్ళరాజు,పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు హాలిమ్,ఎస్ ఎఫ్ ఐ బత్తలయ్య,ఏఐఎస్ ఎఫ్ ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.