విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ముట్టడి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో కలెక్టరేట్ ఉద్రిక్తంగా మారింది.పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వందలాది మంది విద్యార్థులు కలెక్టరేట్ కు  తరలివచ్చారు.సుమారు గంటన్నర సేపు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు నినాదాలు చేశారు.అంతకుముందు ధర్నాను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ గత మూడేళ్లుగా విద్యార్థులకు అందజేయాల్సిన మూడు వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ , ఫీజు రీయింబర్స్మెంట్స్  రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిందన్నారు.విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు పక్కా భవనాలు లేవని భవనాలు నిర్మించాలని  పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు.బస్ పాస్ రేట్లు పెంచడంతో విద్యార్థుల మీద భారం పడుతుందని తక్షణమే రేట్లను తగ్గించాలన్నారు.ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ జరుగుతుందని వేలాది రూపాయలు ఫీజుల దోపిడీ జరుగుతున్నా  అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.ఫీజుల నియంత్రణ చట్టం తేవాలన్నారు.విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలవుతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్స్ అందజేయలేదన్నారు.తక్షణమే పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందజేయాలని డిమాండ్ చేశారు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు బనాయించడం  ద్వారా ఉద్యమాలను ఆపలేరని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాయి, ఉత్తేజ్, వినోద్ కమార్,అజయ్ ప్రసాద్, జశ్వంత్, అనీల్, వేణు, శ్రావణి, యామిని,యమున, సంధ్యా, లలిత, హేమలత, తదితరులు పాల్గొన్నారు.అరెస్ట్ అయి చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఉన్న నాయకులను  సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు  , కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపీ,వేల్పుల వెంకన్న ,పట్నం జిల్లా కన్వీనర్ జీ నర్సింహారావులు పరామర్శించి అరెస్టును ఖండించారు  .