విద్యార్థికి అభినందన
కోల్‌సిటి, జులై 16, (జనం సాక్షి)
ఐఐఐటిలో సీటు సాధించిన గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని విద్యాభారతి హైస్కూల్‌కు చెందిన మునిగంటి రమ్యను సోమవారం పాఠశాల కరస్పాండెంట్ అరుకాల రాంచంద్రారెడ్డి, ఇంఛార్జీ పద్మ ఒక ప్రకటనలో అభినందించారు. గతంలో రోజా అనే విద్యార్థిని సైతం ఐఐఐటిలో సీటు సాధించినట్లు వారు తెలిపారు. రమ్య సీటు సాధించడం పట్ల టిఆర్‌ఎస్‌ఎంఎ, జిల్లా అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు, అనంతరెడ్డి, సర్వోత్తమరెడ్డి, లక్కాకుల తిరుపతి, రాంచంద్రారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.