విద్యార్థిని రమ్మ హత్య దారుణ ఘటన

నిందితుడిని సకాలంలో అరెస్ట్‌ చేసిన పోలీసులు
ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
పసలేని టిడిపి నేతల తీరుపై మండిపడ్డ మంత్రి అవంతి
లోకేశ్‌ విమర్శలు అర్థరహితమని మండిపాటు
విశాఖపట్నం,ఆగస్ట్‌17(జనంసాక్షి): గుంటూరులో విద్యార్థిని రమ్య హత్యను పనిలేని టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. లోకేష్‌ బరువుతో పాటు విచక్షణ కోల్పోయారని ఎద్దేవా చేశారు. గ్రామస్థాయి నాయకులు కంటే లోకేష్‌ భాష అధ్వానంగా ఉందని దుయ్యబట్టారు. సీఎం వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు లోకేష్‌ దిగడం సరికాదన్నారు. పోలీసు స్టేషన్‌ నుంచి విడుదలైన లోకేష్‌ ఏదో విజయం సాధించినట్టు ప్రవర్తించడం అతని అవివేకమని విమర్శించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదని ధ్వజమెత్తారు. విద్యార్థిని రమ్య హత్య బాధాకరమని, అపదలో ఉన్న యువతులు దిశ యాప్‌ వినియోగించుకోవాలని మంత్రి అవంతి సూచించారు.
తమ ప్రభుత్వ హయాంలో యువతులు, మహిళల హక్కులు భంగం కలిగిస్తే సీఎం వైఎస్‌ జగన్‌ ఉపేక్షించరని గుర్తుచేశారు. పోలీసులు సకాలంలో నిందితుడ్ని అరెస్ట్‌ చేశారని తెలిపారు. సీఎం జగన్‌ రమ్య తల్లిదండ్రులకు బాసటగా నిలిచే క్రమంలో ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. విద్యార్థిని రమ్య హత్యకు గురికావడం తీవ్ర దిగ్భార్రతికి గురి చేసిందని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నానని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు దిశ యాప్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తే నిందితులకు కఠిన శిక్ష పడుతుందన్నారు. పని లేని ప్రతిపక్షం రాష్ట్రంలో ఉందని, నారా లోకేష్‌ గ్రామ స్థాయి నాయకుల కంటే హీనంగా ముఖ్యమంత్రిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరామర్శకి వెళ్లి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారు. కుల రాజకీయాలు మానుకోవాలన్నారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అవంతి స్పష్టం చేశారు. ఇదిలావుంటే బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకు గురికావడం దళిత సమాజం తీవ్ర దిగ్భార్రతికి గురయిందని పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత నారా లోకేష్‌కు దళితుల గురించి ఏవిూ తెలియదని అన్నారు. ఆయనకు దళితులపై ప్రేమ ఉంటే, రమ్య కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయాలో ఆలోచించాల న్నారు. మరో ఎమ్మెల్యే వాసుపల్లి గణెళిష్‌ కుమార్‌ మాట్లాడుతూ రమ్య హత్య ఘటన రాజకీయం చేయోద్దన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని హైజాక్‌ చేయడంలో దిట్టన్నారు. నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారని, త్వరలో లోకేష్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.