విద్యార్థి సమస్యలపై ఎస్ఎఫ్ఐ పోరాటం అభినందనీయం
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత V.నరేందర్ రెడ్డి
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 14(జనం సాక్షి)
SFIరాష్ట్ర 4వ మహాసభలు కరీంనగర్ లో నిర్వహించడం సంతోషకరమైన విషయమని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల ఆదినేత V.నరేందర్ రెడ్డి అన్నారు. ఉద్యమాల జిల్లాగా పేరుగాంచిన కరీంనగర్లో నిర్వహించడం శుభ పరిణామం అని, జాతీయ స్థాయిలో SFI పోరాటం అభినందనీయం అన్నారు. విద్యార్థి సంఘం ప్రతినిధులలో మహిళలు అధిక సంఖ్యలో ఉండడం అభినందనీయమని, విద్యార్థి సమస్యల పైన ఎస్ఎఫ్ఐ నిరంతర పోరాటం చేయడాన్ని అభినందించారు.
ప్రారంభ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు రామ్మూర్తి,నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి,SFI మాజీ నాయకులు మిల్కురివాసుదేవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి గుడికందుల సత్యం, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి,CITU ఉపాధ్యక్షులు గిట్ల ముకుంద రెడ్డి,గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.బీమా సాహెబ్, DYFI జిల్లా కార్యదర్శి జి తిరుపతి, ఇతర ప్రజా సంఘల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.