విద్యార్థులకు అల్బెండ జోల్ మాత్రలు పంపిణీ
హుజూర్ నగర్ సెప్టెంబర్ 15 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అల్బెండ జోల్ 400ఎం.జి మాత్రలను పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ డి ఎం హెచ్ వో ఎండి. నిరంజన్, హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు తో కలసి ప్రారంభించారు. గురువారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పిల్లల కోసం 1 నుంచి 19 వ వయస్సు గల వారికి అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో ఆల్బెండజోల్ మాత్రలు ను అందించినట్లు తెలిపారు.
మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 1 నుండి 19 సంవత్సరాల వారు 11085 లక్ష్యానికి గాను, మొదటి రోజు కార్యక్రమంలో 10187 మందికి పంపిణీ చేసి మింగించినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఈ నెల 22న మాపాపప్ కార్యక్రమము ద్వారా అందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ ప్రభాకర్, పి హెచ్ ఎన్ నూర్జహాన్ బేగం, ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.