విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ
వీణవంక నవంబర్ 19 (జనం సాక్షి)వీణవంక బాలుర గురుకుల పాఠశాల చెందిన 12 మంది విద్యార్థులు అలాగే హుజురాబాద్ పట్టణంలోని బాలికల గురుకుల పాటశాలకు చెందిన12 మొత్తం 24 మంది విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది.
మంత్రి హరీష్ రావు అనుచరుడు టిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ నాయకుడు అప్పని హరీష్ వర్మ రాష్ట్ర స్థాయికి విద్యార్థులు ఎంపికైన సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం సుమారు 17 వేల 400 రూపాయలు విలువగల 25 టీ షర్ట్ లు మరియు లోయర్లను క్రీడా దుస్తులు విద్యార్థులకు అందించడం జరిగింది.ఈ సందర్భంగా హరీష్ వర్మ మాట్లాడుతూ మా నాయకుడు హరీష్ అన్న చూపిన మార్గంలో మేము నడుస్తామని ఆపదలో అదే విధంగా నిస్సహాయ స్థితి లో ఉన్న వారికి అన్న అందిచే తోడ్పాటు చూసి మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూన్నామని అన్నారు
అదేవిధంగా విద్యార్థులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయిలో గెలిచి జాతీయ స్థాయిలో రాష్టానికి ఈ ప్రాంతానికి మంచి పేరు తిసుకు రావలను తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురుకులాలలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమైన శిక్షణ ఇచ్చి క్రీడల్లో రాణించడము అభినందనీయమని అన్నారు. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా రానించి తెలంగాణ యొక్క ప్రతిష్టను దేశ నలుమూలల చాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు భవిష్యత్ లో మా నాయకుని బాటలో నడుస్తూ ప్రజల మధ్య ఉంటూ వారికి సేవచేస్తు ముందుకెళ్తాము అని హరీష్ వర్మ అన్నారు అతని వెంట కాట్రేవుల అజయ్
ఈ కార్యక్రమంలొ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల వీణవంక ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్ పి ఈ టి భరత్ కుమార్,కవిత లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.