విద్యార్థులపై కేసులు ఎత్తివేయండి
ఓయూ విద్యార్థి జాక్
హైదరాబాద్, జూన్ 23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్రంకోసం ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులు ముఖ్యంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి విఙ్ఞప్తి చేసింది. ఈ మేరకు టిఎస్‌జెఎసి ప్రతినిధులు శనివారం హం మంత్రి సబిత ఇంద్రారెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థు లపై నమోదు చేసిన కేసులు ఎత్తివేత దిశగా కేంద్ర రాష్ట్ర్ర ప్రభుత్వాలు రెండు హామి ఇచ్చాయని అయితే ఇప్పటివరకు ఆ పని జరగలేదని టిఎస్‌జెసి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులు ఎత్తివేయకుంటే కానిస్టేబుల్ ,ఎస్సై తదితర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సెలక్షన్ జాబితా లో చోటు దక్కించుకున్న వారికి ఉద్యోగాలు దక్కక సమస్యలకు గురవుతారని విద్యార్థి నేతలు ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల నడుమ కేసులను వెంటనే ఎత్తివేయాలని హోం మంత్రిని కోరినట్లు టిఎస్‌జెఎసి నేతలు పి.రవి రాజారాం యాదవ్ చెప్పారు. కాగా. కేసులు నమోదై ఉండి సెలక్షన్ జాబితాలో చోటు దక్కించుకున్న విద్యార్థుల పేర్లని5 రోజుల్లో వేరుచేసి వారిపై కేసుల ఎత్తివేతకు ఈ క్రమంలో మిగిలిన వారిపైన ఉన్న కేసుల ఎత్తివేతను పరిశీలిస్తామని హోంత్రి హామి ఇచ్చినట్లు విద్యార్థి నాయకులు చెప్పారు.