విద్యార్థుల ఆటో బోల్తా పలువరికి గాయాలు
వరికుప్పను ఢీకొని పడి మృతి చెందిన వ్యక్తి
వికారాబాద్,నవంబర్22(జనం సాక్షి): విద్యార్తుల ఆటో బోల్తా పడిన ఘటనలో 8మంది గాయపడగా, మెదక్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడుజిల్లాలోని కుల్కచర్ల మండలంలో విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడిరది. మండలంలోని ముజాహిద్‌పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిరది. దీంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను పరిగి దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థులు ముజాహిద్‌పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 20 మంది విద్యార్థున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై పోసిన వడ్ల కుప్పకు ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎనగుర్తి గ్రామానికి చెందిన ప్రభు(28) అదివారం రాత్రి బైక్‌పై తన బంధువు దానయ్యతో కలిసి ఎనగుర్తి వైపు వెళ్తున్నాడు. భూంపల్లి గ్రామ సవిూపంలో రహదారిపై నల్లని పాలీథీన్ కవర్ కప్పి ధాన్యం కుప్ప ఉండడంతో చీకటిలో కనిపించక ఢీకొంది. ప్రభు బైక్‌పై నుంచి రహదారిపై ఎగిరిపడి, అక్కడిక్కడే మృతి చెందాడు. దానయ్యకు గాయాలయ్యాయి. ప్రభుకు భార్య రాధ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రహదారిపై వడ్ల కుప్పలు పోయడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు మండిపడ్డారుఎ. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.